పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించేశాడు. ‘ది రాజా సాబ్’ సినిమా కోసం ప్రభాస్ ఫీజులో కోత పడిందని టాక్. బాహుబలి తర్వాత ఒక్కో సినిమాకు రూ.150కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా తన రెమ్యూనరేషన్ లో రూ.50 కోట్లు తగ్గింది. అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నాడట.
నిపిస్తోంది. అయితే ఆదిపురుష్. రాధేశ్యామ్ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడం, పైగా ప్రభాస్ నటన, గెటప్ కూడా ట్రోలింగ్ ను ఎదుర్కోవడం వంటి కారణాల వల్ల ఇలా రెమ్యూనరేషన్ లో కోత పడిందని మొటట అనుకున్నారు. అయితే సలార్, కల్కి 2898 ఏడీ మూవీస్ హిట్టయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే రెమ్యూనరేషన్ అదే రేంజ్ లో ఉండాలి. మరి ఎందుకు తగ్గించుకున్నట్లు అనే ప్రశ్న ఫ్యాన్స్ లోనూ ఉంది. దీనికో కారణం ఉంది. ‘ది రాజా సాబ్’ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
ఆదిపురుష్ ను నిర్మించిన సంస్థ కూడా ఇదే. కాబట్టి ఆదిపురుష్ ద్వారా వచ్చిన నష్టాలను తగ్గించేందుకు, నిర్మాతలపై ఎక్కువ భారం కాకుండా ఉండేదుకు ప్రభాస్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో మా ప్రభాస్ ది ఎంత మంచి మనసో అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్ లో భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ‘ది రాజా సాబ్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు మారుతికి ఇది ఓ పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ కాబోతోంది. ఈ సినిమా నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ . 2025, డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
Also read: పవన్ ఫ్యాన్స్ బీ రెడీ.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
Also read: ఆల్ టైమ్ హిట్ గా ‘కుబేర’
Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!
Also read: https://in.bookmyshow.com/movies/hyderabad/the-raja-saab/ET00383697