ఆల్ టైమ్ హిట్ గా ‘కుబేర’

ET World Latest Posts Trending Now

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల మధ్య రిలీజైన నాగార్జున, ధనుష్ మూవీ ‘కుబేర’ యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈమధ్య కాలంలో ఇంతలా విమర్శకుల మెప్పుపొందిన సినిమా‘కుబేర’నే. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ కు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో అందరిదీ ఒకటే కంప్లయింట్. సినిమా నిడివి ఎక్కువైయిందని. కానీ 3 గంటల సినిమా ఆడియన్స్ ను అలాగే కూర్చోబెట్టింది. శేఖర్ కమ్ముల ఈ సినిమాను తీసిన విధానం అద్భుతంగా ఉందంటున్నారు ప్రేక్షకులు.

సినిమాలో ధనుష్ పెర్ఫార్మెన్స్ టాప్ నాట్చ్ అనిపించే నటనతో మెప్పించగా.. సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ లో అయితే సెంటిమెంట్ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసిందంటున్నారు. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ లా ‘కుబేర’ సినిమా అనిపించిందంటున్నారు ఆడియన్స్ . ఇక క్లైమాక్స్ కొంచం అబ్ నార్మల్ గా ఎండ్ చేసిన ఫీలింగ్ కలిగిందని ఇది తప్పితే సినిమాలో మైనస్ పాయింట్స్ అంటూ పెద్దగా ఏమి లేవని, ధనుష్-నాగార్జునలు పోటి పడి నటించారని అంటున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలవగా శేఖర్ కమ్ముల మరోసారి తన బ్రాండ్ వాల్యూని నిలుపుకున్నారని చెబుతున్నారు. ఓవరాల్ గా లెంత్ ఒక్కటి చిన్న ప్రాబ్లం లా కనిపిస్తున్నా పెద్దగా వంక పెట్టడానికి వీలు లేకుండా కుబేర ఎక్స్ లెంట్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైంకి సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఈ రేంజ్ టాక్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా లాంగ్ రన్ లో మాస్ రచ్చ చేయడం ఖాయమనే చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ టాక్ తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!

Also read: దుమ్మురేపుతున్న కుబేర బుకింగ్స్

Also read: ఈట‌ల దారెటు?

Also read: https://in.bookmyshow.com/movies/mumbai/kuberaa/ET00390532

Tagged