*) బీజేపీలో ఇమడలేకపోతున్న రాజేందర్
*) పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. ఆ పార్టీలో ఇమడలేకపోతున్నట్టు కనిపిస్తోంది. కాషాయ దళం నుంచి ఆయన బయటకు రావాలని చూస్తున్నట్టు సమాచారం. కానీ ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో, ఇప్పుడే ఆయన అలాంటి స్టెప్ తీసుకోరని.. ఎలక్షన్ టైంలో పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఈటల ఆలోచనలకు.. బీజేపీ సిద్ధాంతాలకు సెట్ కావడం లేనట్టు తెలుస్తోంది. ఆయన మావోయిస్టు ఉద్యమాల నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రి అయ్యారు. ఉద్యమకాలం నుంచీ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో కీలకంగా వ్యవహరించారు. మాజీ సీఎం కేసీఆర్ కు చేదోడుగా నిలిచారు.
తెలంగాణ ఏర్పడక ముందు కూడా ఈటలకు కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చారు. శాసనసభలో పార్టీ నేతగా అవకాశం కల్పించారు. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని భావించిన ఈటల.. కారు దిగి కాషాయం గూటికి చేరారు. అప్పట్లో ఆయనపై భూ ఆక్రమణ కేసు నమోదైంది. ఈటలకు ఊపిరి సలపని పరిస్థితి ఎదురైంది. ఆ టైంలో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆ పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు. అధికారంలోకి వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. ఇక, కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచినప్పుడు ఈటల.. అప్పటి సర్కారుకు అనుకూలంగా మాట్లాడినట్టు సమాచారం. అంతేకాదు బీఆర్ఎస్ నేతలతో ఆయనకు ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో, ఈటల మళ్లీ సొంతగూటికి చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎంపీగానే మిలిగిపోతాననే అసంతృప్తి?
ప్రస్తుతం ఈటల.. మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. కానీ అది తనకు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఈటల భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే కేవలం ఎంపీగానే మిగిలిపోవాల్సి వస్తుందని ఆయన అనుకుంటున్నారట. ఇక, తెలంగాణలో బీజేపీ.. 8 లోక్ సభ స్థానాలు గెలవడం వెనుక తన కృషి చాలా ఉందని ఈటల భావిస్తున్నారు. ఇదే టైంలో కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ బీజేపీ పెద్దలు దీన్ని పరిగణలోకీ తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో కొనసాగితే తనకు రాజకీయంగా ఎదుగుదల ఉండదని ఈటల భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్ల ఆయన ఆ పార్టీని వీడతారని టాక్ నడుస్తోంది. ఈటల రాకను బీఆర్ఎస్ నేతలు కూడా స్వాగతిస్తున్నట్టు సమాచారం. దీంతో, ఆయన మళ్లీ గులాబీ దళంలో చేరతారని భావిస్తున్నారు. ఇది జరుగుతుందా? లేక ఈటల వేరే ఏదైనా స్టెప్ తీసుకుంటారా? వేచి చూడాలి.
Also read: కేటీఆర్ అరెస్ట్ తప్పదా?
Also read: “కాళేశ్వరం” చుట్టూ రాజకీయ దుమారం
Also read: బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ రాజకీయం