మెగామదర్ అంజనా దేవి ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. ఆమె హెల్త్ కండిషన్ క్రిటికల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. వీటికి మెగా బ్రదర్ నాగబాబు చెక్ పెట్టారు. ‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మ చక్కగా ఉంది” అని సోషల్ మీడియాలో తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటీన హైదరాబాద్ కు వచ్చారు. మంగళవారం ఉదయం ఏపీ కేబినెట్ మీటింగ్ మొదలైంది.
దానికి హాజరైన పవన్… మీటింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే బయటకు వచ్చేశారు. తన తల్లి హెల్త్ బాగోలేదని, అందుకే బయటకు వచ్చినట్టు లీకులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి చిరంజీవి ఇంటికి వెళ్లారు. దాంతో అంజనా దేవి ఆరోగ్యంపై మెగా అభిమానులలో మరింత ఆందోళన కలిగింది. చివరకు నాగబాబు క్లారిటీ ఇవ్వడంతో రిలీఫ్ ఫీలయ్యారు.
Also read: తిరుమలలో లడ్డూ టోకెన్లకు కియాస్కులు
Also read: 5 సార్లు తప్పించుకున్నాడు.. ఆరోసారి బలయ్యాడు
Also read: విదేశాల్లో చదువులు ఆగినట్టేనా ?
Also read:https://www.sakshi.com/telugu-news/movies/chiranjeevi-mother-anjana-devi-unwell-latest-2487072