తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం లడ్డూ కౌంటర్ల దగ్గర సెల్ఫ్ సర్వీస్ కియాస్క్‌లను ఏర్పాటు చేసింది. టచ్ స్క్రీన్ ఉండే ఆ మెషీన్ దగ్గర, ఎవరికైనా అదనపు లడ్డూలు కావాలంటే టోకెన్లు తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ ద్వారా లడ్డూ టోకెన్లు జారీ అవుతాయి.
కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు టీటీడీ ఈ ప్రయత్నం చేస్తోంది. తిరుమలలో వేర్వేరు లడ్డూ కౌంటర్ల దగ్గర ఈ కొత్త కియాస్క్ మెషీన్లను ఏర్పాటు చేశారు. పేమెంట్ సక్సెస్ అయ్యాక భక్తులకు రిసిప్ట్ వస్తుంది, దాన్ని చూపించి అదనపు లడ్డూలను కౌంటర్ నుంచి తీసుకోవచ్చు. భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు టీటీడీ డిజిటల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫస్ట్ టైమ్ కియాస్క్‌లను వాడే వారికి, వృద్ధుల కోసం ప్రత్యేకంగా స్టాఫ్ ను నియమించారు.
Also read: 5 సార్లు తప్పించుకున్నాడు.. ఆరోసారి బలయ్యాడు
Also read: విదేశాల్లో చదువులు ఆగినట్టేనా ?
Also read: భారీగా తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు !