షెఫాలీ మృతికి ఆ మందులే కారణం

ET World Latest Posts Trending Now

యాంటీ ఏజింగ్ మెడిసన్స్ డేంజరా ?

3 డేస్ బ్యాక్… బాలీవుడ్ నటి, మోడల్ షెఫాలీ జరీవాలా చనిపోయింది.. మొదట ఆమెకు గుండెపోటు వచ్చిందని అన్నారు. 42 ఇయర్స్ ఆమెకు… ఈ ఏజ్ లోనే ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంపై చర్చ నడిచింది. కానీ ఆమె షెఫాలీ జరీవాలా మరణం…. యాంటీ-ఏజింగ్ మందుల ప్రభావమే అన్న టాక్ నడుస్తోంది…
నిజంగా మందులతో మన వయస్సును మనం తగ్గించుకోవచ్చా. వయస్సు అంటే ఎలాగూ తగ్గదు… కనీసం వయస్సుతో పాటు వచ్చే వృద్దాప్య ఛాయలు, ముడతలు లాంటివి తగ్గించుకునే ఛాన్సుందా…
నేచురల్ రెమిడీస్ ఆయుర్వేదం, యోగా, మెడిటేషన్ లాంటివి ఉండగా.. ఇలా లేనిపోని ఇంగ్లీష్ మందులతో వీళ్ళు ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకుంటున్నారు..

షెఫాలీ జరీవాలా మృతి – యాంటీ-ఏజింగ్ మందులే కారణమా?

‘కాంటా లగా’ పాటతో సెలబ్రిటీగా మారిన నటి, మోడల్ షెఫాలీ జరీవాలా… ఈమెకు 42 యేళ్ళు..
ఈనెల 27 న ముంబైలో ఆకస్మికంగా చనిపోయింది. ఆమె మృతికి కార్డియాక్ అరెస్ట్ అని ప్రాథమికంగా చెబుతున్నారు. కానీ, ఆమె యాంటీ-ఏజింగ్ చికిత్సలో భాగంగా గ్లూటథియోన్, విటమిన్ సి లాంటి ఇంజెక్షన్లు, మందులు తీసుకుంటున్నట్టు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముంబై పోలీసులు ఆమె ఇంట్లో ఈ మందులను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అయితే మరణానికి అసలు కారణం పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే తెలుస్తుంది. యాంటీ ఏజింగ్ మెడిసన్స్ వల్లే చనిపోయిందని ఇప్పుడే కన్ఫమ్ చేయలేం. కానీ 90శాతం అదే కారణం అయి ఉంటుందని అంటున్నారు. షెఫాలీ గత ఐదేళ్ళుగా…యవ్వనంగా కనిపించడానికి ఈ చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది. మరణానికి ముందు రోజు ఉపవాసం ఉండి కూడా ఆమె యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దాంతో ఆమె బీపీ ఒక్కసారిగా పడిపోయి, గుండెపోటు వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కానీ, డాక్టర్లు మాత్రం గ్లూటథియోన్ లాంటి మందులు గుండెపై ప్రత్యక్షంగా ప్రభావం చూపవని చెబుతున్నారు.

యాంటీ-ఏజింగ్ మందులు… అసలు ఇవి కరెక్టుగా పనిచేస్తాయా?

యాంటీ-ఏజింగ్ మెడిసన్స్, ఇంజెక్షన్లు…. మనిషి చర్మాన్ని తెల్లగా, యవ్వనంగా చూపించడానికి ఉపయోగిస్తారు. గ్లూటథియోన్, విటమిన్ సి, బొటాక్స్, ఫిల్లర్స్ లాంటివి ఇందులో భాగం అట. ఇవి చర్మంలో ముడతలు తగ్గించడం, డీటాక్సిఫికేషన్ చేయడం లాంటి పనులకు ఉపయోగపడతాయని చెబుతారు. కానీ, ఈ మందులు పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు.

సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ?

గ్లూటథియోన్ ఇంజెక్షన్ల వల్ల కొందరిలో అలర్జీలు, కిడ్నీ సమస్యలు, బీపీలో మార్పులు రావచ్చు. ఒకవేళ సరైన డోస్, సరైన డాక్టర్ సలహా లేకుండా తీసుకుంటే ప్రమాదం చాలా ఎక్కువ. ఈ మెడిసన్స్ తాత్కాలికంగా చర్మాన్ని మెరుగుపరుస్తాయి, కానీ శాశ్వతంగా వృద్ధాప్యాన్ని ఆపలేవు. ముసలి తనాన్ని అడ్డుకునే శక్తి ఈ మందులకు లేదు. వృద్ధాప్యం అనేది జన్యుపరమైన, జీవనశైలి, పర్యావరణ కారణాల వల్ల వస్తుంది. అసలు యాంటీ ఏజెంగ్ మందులు ఎందుకు వాడాలి అంటే… చాలామందికి ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్, ఇన్ ఫ్లుయెన్సర్లకు యవ్వనంగా కనిపించాలనే కోరిక పెరుగుతోంది… మన ఏజ్ పెరిగిపోతోంది… ఏజ్ కి తగ్గట్టుగా శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని తెలుసు… అయినా సరే… సోషల్ మీడియా ప్రెజర్, సెలబ్రిటీ కల్చర్ వల్లే చాలామంది ఈ మందుల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…
ముఖ్యంగా సినిమా, మోడలింగ్ రంగాల్లో ఈ మందల వాడకం కామన్ గా మారింది.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు
ఇంతకు ముందు కూడా ఇలా యాంటీ-ఏజింగ్ మందుల వల్ల చనిపోయిన సంఘటనలు జరిగాయి…
షెఫాలీ జరీవాలా కేస్‌తో యాంటీ-ఏజింగ్ మందులపై చర్చ మళ్లీ మొదలైంది. గతంలో కూడా ఇలాంటి మందుల వల్ల మరణాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ చాలా సందర్భాల్లో ఇవి అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఉదాహరణకు: 2018లో థాయ్‌లాండ్ కేస్: ఒక మహిళ గ్లూటథియోన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తీవ్ర అలర్జీ రియాక్షన్ వల్ల మరణించిందని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ, దీనికి కారణం సరైన వైద్య పర్యవేక్షణ లేకపోవడమే అని తేలింది. 2020లో ఫిలిప్పీన్స్‌లో ఓ సంఘటన జరిగింది..
యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకున్న కొందరు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, ఒకరు చనిపోయారని అంటారు. అయితే, ఇవి నకిలీ ఉత్పత్తుల వాడకం వల్ల జరిగినవని తేలింది. యాంటీ-ఏజింగ్ మందుల వల్లే మరణాలు జరిగాయని 100% ప్రూవ్ కాలేదు. సరైన డాక్టర్ సలహా లేకపోవడం… క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

నేచురల రెమిడీస్ లేవా ?
నేచరుల్ గా మన శరీరాన్ని అందంగా ఉంచుకోలేమా… అందుకు ఎవైనా రెమిడీస్ ఉన్నాయా అంటే… ఉన్నాయి… ఆయుర్వేదం, నాచురల్ రెమెడీలు… దీనికి సురక్షితమైన ఆప్షన్. యాంటీ-ఏజింగ్ మందుల కంటే ఆయుర్వేదం, నాచురల్ రెమెడీలు, యోగా, మెడిటేషన్ లాంటి సురక్షితంగా, సహజంగా వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
అందులో ఆయుర్వేద మూలికలు…
అశ్వగంధ : ఒత్తిడిని తగ్గించి, శరీరానికి శక్తినిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బ్రాహ్మి: మెదడు ఆరోగ్యాన్ని, చర్మ యవ్వనాన్ని పెంచుతుంది.
తులసి: యాంటీ-ఆక్సిడెంట్ గుణాలతో చర్మ ముడతలను తగ్గిస్తుంది.
ఆమ్లా అంటే ఉసిరి : విటమిన్ సి సహజ సిద్ధంగా ఉంటుంది… ఇందులో ఎక్కువగా ఉండే ఆమ్లాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
ఇంకా నాచురల్ రెమెడీలు కావాలంటే… మన తీసుకునే ఫుడ్ లో గ్రీన్ టీ, బాదం, అవకాడో, బెర్రీలు, ఆకుకూరలు లాంటి వాల్లో యాంటీ-ఆక్సిడెంట్స్‌ ఉంటాయి… వాటితో వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ఇవి కాకుండా ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. అలోవెరా, తేనె, కొబ్బరి నూనె వంటివి చర్మానికి సహజంగా మేలు చేస్తాయి. కాకపోతే ఈ ఆయుర్వేద మందులు కూడా క్వాలిఫైడ్ డాక్టర్ల సజెషన్స్ తో వాడితే బెటర్.

యోగా, మెడిటేషన్ చాలా ముఖ్యం.
యోగా: సూర్యనమస్కారం, భుజంగాసనం, శీర్షాసనం లాంటి ఆసనాలతో రక్తప్రసరణను మెరుగుపడి… చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
మెడిటేషన్: ఒత్తిడిని తగ్గించడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం అవుతాయి. రోజూ 10-15 నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉంటే చాలా సమస్యలకు చెక్ చెప్పొచ్చు…
వాకింగ్: రోజూ అరగంట నడవడం శరీరాన్ని ఫిట్‌గా, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

డాక్టర్ సలహాలు ముఖ్యం

నటి షెఫాలీ జరీవాలా యాంటీ-ఏజింగ్ మందుల వల్లే చనిపోయిందని అంటున్నారు. ఇంకా పోలీసులు కన్ఫమ్ చేయలేదు. అయితే ఇలాంటి మందులు తాత్కాలిక ఫలితాలు ఇచ్చినా,
వాటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదకరంగా ఉండొచ్చు. దానికి బదులుగా, ఆయుర్వేదం, యోగా, మెడిటేషన్, సహజమైన ఆహారం లాంటి ఆరోగ్యకరమైన, సురక్షితమైన లైఫ్ ని ఇస్తాయి. వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. దాన్ని యాక్సెప్ట్ చేయాలి… ముఖ్యంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు 90యేళ్ళు వచ్చినా… మనం అందంగానే కనపడతామని అర్థం చేసుకోవాలి.
ఏదేమైనా అల్లోపతి, ఆయుర్వేదం ఏదైనా సరే మందులు తీసుకునే ముందు అనువజ్ఞులైన డాక్టర్ ను కాంటాక్ట్ అవడం చాలా అవసరం.

Also read: హరిహర వీరమల్లు కొత్త పోస్టర్

Also read: సినిమా వదులుకోడానికైనా రెడీ : రష్మిక మందన్నా

Also read:  రెమ్యూనరేషన్ డబుల్ శ్రీలీలా

Also read: https://www.ndtv.com/entertainment/shefali-jariwala-death-anti-ageing-medicines-could-be-a-major-reason-for-cardiac-arrest-says-source-8786491

Tagged

Leave a Reply