కానీ అలాంటి రోల్ చేయను : రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస హిట్ సినిమాలతో రష్మిక ఫుల్ జోష్ లో ఉన్నారు. రష్మిక నటించి పుష్ప 2, ఛావా, కుబేర లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫ్యాన్స్ కు పండగ చేస్తున్నారు. లేటేస్ట్ రష్మిక మైసా అనే కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమధ్య వి ద ఉమెన్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్న ఈ కన్నడ బ్యూటీ స్మోకింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
స్మోకింగ్ ను తను అస్సలు ఎంకరేజ్ చేయనని.. అలాంటి రోల్స్ కూడా చేయనని క్లారిటీగా చెప్పేశారు రష్మిక. పర్సనల్ గా స్క్రీన్ పైన కానీ లేదంటే రియల్ లైఫ్ లోనూ స్మోకింగ్ అస్సలు చేయనన్నారు. తనకు ఈ స్మోకింగ్ కాన్సెప్ట్ అస్సలు నచ్చదట. ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమేనన్నారు. ఒకవేళ ఎవరైనా వచ్చి సినిమాలో తనకి స్మోక్ చేసే పాత్ర చేయాలని అడిగితే.. ఆ సినిమాను ఒదులుకోడానిక్కూడా సిద్ధమేనని కామెంట్ చేశారు రష్మిక.
Also read: ‘ENE రిపీట్’ టైటిల్ తో ఫుల్ ట్రీట్
Also read: సమంత, రకుల్ కి నోటీసులిస్తారా ?
Also read: రాహుల్.. రేవంత్ తరపున సారీ చెప్పు