సమంత, రకుల్ కి నోటీసులిస్తారా ?

ET World Latest Posts Trending Now

ఏడాదిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఫోన్లు ట్యాపింగ్ అయిన పొలిటికల్ లీడర్లను పిలిచి, స్టేట్ మెంట్స్ తీసుకుంది ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్. అయితే లేటెస్ట్ గా కొత్తగా కొందరు హీరోయిన్లు, యాంకర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో మాత్రమే సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్లు మాత్రమే ట్యాప్ అయినట్టు తేలింది. సమంత-నాగచైతన్య పెళ్ళి బంధం దెబ్బతినడానికి ఫోన్ ట్యాపింగే కారణమనే ప్రచారం అప్పట్లో నడిచింది.

 

అప్పుడే రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది. కానీ లేటెస్ట్ గా అనసూయ, ఈషా రెబ్బా, హెబ్బా పటేల్ పేర్లు బయటకు వచ్చాయి. ఓ బీజేపీ ఎమ్మెల్యే హెబ్బా పటేల్ పేరును బయటపెట్టారు. ఆమె ఫోన్ ట్యాప్ అయిందనే సమాచారం తన దగ్గర ఉందన్నారు. ఈ కేసుపై ఇప్పటికే పొలిటికల్ లీడర్లు, మీడియా ఎండీలు, సీఈఓలు, జర్నలిస్టులు, అధికారులు, వ్యాపారవేత్తల స్టేట్ మెంట్స్ తీసుకున్న సిట్ అధికారులు, ఈ హీరోయిన్లను కూడా ఎంక్వయిరీకి పిలుస్తారా? అనే చర్చ నడుస్తోంది.
వాళ్ళకి కూడా నోటీసులిచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కానీ వీళ్లెవ్వరూ తమ ఫోన్లు ట్యాప్ అయినట్టు పబ్లిక్ గా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. అందువల్ల అటు సిట్ అధికారులు కూడా స్పష్టమైన ఆధారాలు దొరికితేనే వీళ్ళకి నోటీసులు ఇచ్చే ఛాన్సుంది. కానీ సిట్ అధికారులకు ఏ చిన్న లీడ్ దొరికినా హీరోయిన్ల స్టేట్ మెంట్స్ రికార్డు చేసే అవకాశముందని చెబుతున్నారు.

Also read: రాహుల్.. రేవంత్ తరపున సారీ చెప్పు

Also read: సీఎం కాన్వాయ్ కే.. నీళ్లు కలిపిన డీజిల్

Also read: తమిళనాడులో పవర్ స్టార్ సునామీ

Also read: https://www.siasat.com/telangana-sit-intensifies-probe-into-phone-tapping-scandal-3234476/

Tagged

Leave a Reply