ఈ కాలంలో ఎక్కువ మంది శారీరక శ్రమ తక్కువ, తప్పుడు ఆహారపు అలవాట్లు ఎక్కువగా ఉండటంతో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం సాధారణంగా మారింది. ఇది కేవలం శరీర దృష్టికే కాకుండా, అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, సహజమైన కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను కొంత మేరకు నియంత్రించవచ్చు.
ఇక అలాంటి బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడే ముఖ్యమైన ఆహారాలు ఇవే:
1. నిమ్మరసం
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే, ఇది శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మెటబాలిజాన్ని ఉత్తేజపరిచి, కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
2. క్యాబేజీ
ఇది తక్కువ కేలరీలతో, అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు తక్కువ అవుతుంది.
3. జీలకర్ర నీరు
జీలకర్రను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే, మెటబాలిజాన్ని యాక్టివ్ చేసి బాడీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.
4. గ్రీన్ టీ
రోజుకు ఒకటి రెండు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల జిడ్డు కరుగుతుంది, ఫ్రీ రాడికల్స్ తొలగుతాయి. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహకరించే నేచురల్ డ్రింక్.
5. తక్కువ కొవ్వు మజ్జిగ
ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గించి పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
6. పెసరపప్పు
ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే పెసరపప్పు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తరచూ తినాలనే కోరిక తగ్గి, ఎక్కువ తినకుండా ఉండటంతో కొవ్వు తగ్గుతుంది.
7. ఓట్స్
ప్రతి ఉదయం ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి తేలికగా తినదగిన ఆహారం లభిస్తుంది. ఇందులో ఉండే బీటా-గ్లూకాన్ ఫైబర్ పొట్టలో కొవ్వు పేరుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది.
8. దాల్చినచెక్క
ఇందులో ఉండే న్యూట్రియెంట్లు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా తయారుచేయబడింది. మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
Join our Telegram Channel : CLICK HERE
Join our What’s app Group : CLICK HERE
Read also : ఐటీ పీపుల్ కి ఫ్యాటీ లివర్ !
Read also : సద్గురు మెడిటేషన్ తో మెదడు యాక్టివ్! – Harvard Studyలో కొత్త నిజాలు