IT People Fatty Liver : ITతో పాటు BPO రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో కాలేయం (Liver) సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఈమధ్య సర్వేలో తేలింది. దేశంలో 54 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళల్లో 84 శాతం మంది Fatty Liver తో పాటు కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్నారు. 71 శాతం మంది IT ఉద్యోగుల్లో ఒబెసిటీ (Obesity) సమస్య ఉంది. వీళ్ళల్లో 34 శాతం మంది జీవక్రియ సిండ్రోమ్ తో ఇబ్బంది పడుతున్నట్టు AIG వైద్య నిపుణులు, HCU రీసెర్చ్ స్కాలర్ల స్టడీలో బయటపడింది. ఐటీ ఉద్యోగులు చిరు తిళ్ళు తినడం, నిద్రలేకపోవడం, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారణాలు ఈ అనారోగ్య సమస్యకు కారణమవుతున్నాయి. ఫ్యాటీ లివర్ తో పాటు, బీపీ, డయాబెటిస్ లాంటి వ్యాధులు కూడా ఎటాక్ చేస్తున్నాయి.
కాలేయంలో కొవ్వుతో ఫ్యాటీ లివర్ !
IT ఉద్యోగుల్లో జీవక్రియపై ఒత్తిడి పడుతోంది. దాంతో కాలేయంలో 5 శాతం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోతోంది. అదే ఫ్యాటీ లివర్ కు కారణమవుతోంది
ఐటీ ఉద్యోగుల్లోనే ఎందుకు ?
అధిక పని గంటలు, రకరకాల పని వేళలు (ఉదయం, రాత్రి టైమ్ సరిగా లేకపోవడం)
పనిలో తీవ్ర ఒత్తిడి
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోని పని చేస్తుండటంతో శారీరక శ్రమ లేకపోవడం
సరిగా నిద్ర లేకపోవడం, అనారోగ్యకరమైన చిరుతిళ్ళు అంటే జంక్ ఫుడ్ తినడం
ఈ కారణాలే కాలేయం (Liver) ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఫ్యాటీ లివర్ గుర్తించకపోతే…
ఫ్యాటీ లివర్ సమస్యను ముందే గుర్తించకపోతే తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. లివర్ వాపు, లివర్ ని ఛేంజ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమందిలో క్యాన్సర్ కూడా ఎటాక్ అయ్యే ఛాన్సుంది.
ఐటీ ఉద్యోగులూ జాగ్రత్త !
ఐటీ ఉద్యోగులు ఇప్పటికైనా తమ జీవన శైలి (Life Style)ని కూడా మార్చుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం (Exercises) చేయాలి. తరుచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వర్క్ – లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేయొద్దు. పనిలో ఒత్తిడి సహజం కాబట్టి… ప్రతి రోజూ Meditation చేసుకోవాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్ర పోవాలి. ఐటీ ఉద్యోగులే కాదు… సంస్థలు కూడా తమ Employees ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. 90 గంటలు, 80 గంటలు చేయాలి అంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వడం కాదు. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
Read this also : జాగ్రత్త… కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ !
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.
Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK