రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం… ఉదయం బారెడు పొద్దెక్కాక లేవడం… ఈ రెండూ డేంజరే ! ఇలా చేసేవాళ్ళలో శరీరం బరువు, ఎత్తు నిష్పత్తి (BMI), నడుం చుట్టుకొలతలు పెరుగుతున్నాయి. కానీ రాత్రిళ్ళు తొందరగా పడుకునేవాళ్ళతో పోలిస్తే ఆలస్యంగా మెలకువతో ఉండే వాళ్ళకే డయాబెటీస్ (Diabetes) వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉందని స్టడీస్ చెబుతున్నాయి. నిద్రకీ, డయాబెటీస్ కీ సంబంధం ఉంటున్నట్టు గతంలో స్టడీస్ లోనూ బయటపడింది.
ఇలాగైతే కష్టమే !
ఆలస్యంగా నిద్రపోవటంతో పాటు వేళా పాళా లేని భోజనం, జంక్ ఫుడ్ తినడం లాంటి అంశాలు కూడా డయాబెటీస్ కు కారణం అవుతున్నాయి. ఆలస్యంగా పడుకోవడం… అలాగే నైట్ అవుట్ ఉద్యోగాలతో సమన్వయం కుదరడం లేదు. దాంతో మన జీవగడియారం (bio clock) దెబ్బతింటోంది. జీవగడియారం గాడి తప్పితే జీవక్రియలు గందరగోళంలో పడతాయి. చివరికి ఇవన్నీ మధుమేహానికి (Diabetes) కారణమవుతున్నాయి. కొందరి నిద్ర వేళలు, శరీరంలో కొవ్వు విస్తరణ, మధుమేహం వ్యాపించడానికి కారణమవుతున్నట్టు స్టడీస్ చెబుతున్నాయి.
లేట్ గా పడుకుంటే…!
ఆలస్యంగా పడుకునే వాళ్ళల్లో సగటున ప్రతి మీటరుకు 0.7 కిలోల BMI, నడుం చుట్టుకొలత 1.9 cms, కాలేయంలో కొవ్వు 14% ఎక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. ఇవన్నీ మధుమేహం ముప్పు పెరిగేలా చేస్తున్నాయి. అందుకే రాత్రిపూట సినిమాలు, OTT ప్రోగ్రామ్స్, Social media content చూడటాన్ని తగ్గించాలి. రాత్రిళ్ళు తొందరగా పడుకోవడం చాలా మంచిది. అలాగే ఉదయం పూట తొందరగా నిద్రలేస్తే ఇంటి పనితో పాటు… ఆఫీసు పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.