ప్రస్తుతం ఉన్న కొలువుల్లో చాలామందివి ఆఫీసుల్లో జాబులే… గతంలో ఎద్దేవా చేయడానికి కొందరు అనేవారు… నీకేందిరా ఫ్యాన్ కింద ఉద్యోగం… అని… కానీ ఆ ఫ్యాన్ కింద కుర్చీలో గంటల కొద్దీ ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కువైంది… మీడియా, సాఫ్ట్ వేర్ ఫీల్డ్ వాళ్ళ పరిస్థితి మరీ అధ్వానం… ఎన్ని గంటలు కూర్చొని పనిచేస్తారో తెలియదు…ఇలా కుర్చీకి అతుక్కుపోతే మాత్రం మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు డాక్టర్లు.
అదే పనిగా కూర్చొని ఉండిపోవడం అనేది… విపరీతంగా సిగరెట్ తాగే వాళ్ళ ఆరోగ్యం ఎంత పాడవుతుందో… వీళ్ళదీ అంతే అంటున్నారు… ఎంత కష్టపడ్డా తొందరగా బరువు తగ్గకపోవడం, విపరీతమైన నడుము నొప్పి తో (Back pain) పాటు… హార్మోనుల్లో అసమతుల్యత లాంటి పరిణామాలు కలగడం… లాంటి కారణాలు కుర్చీలో ఎక్కువగా కూర్చొని పనిచేయడమే అంటున్నారు. కొందరు అంటుంటారు… మేం కుర్చీలో ఎన్ని గంటలు కూర్చున్నా ఫర్లేదు.. ఉదయం లేచి వర్కవుట్లు (Morning workouts) చేస్తాం… మహిళలైతే ఇంట్లో బోల్డంత పనితో తమకు వ్యాయామం (Exercise) అవుతుందని కూడా చెబుతారు. కానీ నిరంతరం కూర్చొని ఉండేవారికి… ఎన్ని వర్కవుట్లు చేసినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నాయి కొన్ని ఆరోగ్య సర్వేలు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు (Cholesterol levels) పెరగడం, మధుమేహంతో పాటు…గుండె జబ్బులకు (Heart attacks) కూడా ఈ కుర్చీలో కూర్చొని పనిచేయడమే కారణం అవుతోందని చెబుతున్నాయి ఈ సర్వేలు.
కుర్చీ ఉద్యోగాల వాళ్ళు ఏం చేయాలి ?
గంటల కొద్దీ కుర్చీల్లో కూర్చొని పనిచేసేవారు… ప్రతి అరగంటకోసారి లేవడం అలవాటు చేసుకోవాలి. నాలుగు అడుగులు వేయండి.. లేదంటే… కనీసం కొద్దిసేపు నిల్చొని… మళ్ళీ మీ పనిలో పడండి… ఇంకా కాకపోతే… ఇంట్లో ఉండేవాళ్ళయితే కాస్సేపు టీవీ చూడండి… కాస్సేపు మాత్రమే…టీవీ, ఏసీ రిమోట్స్, మొబైల్ (Mobile) లాంటివి మీరు పనిచేసే కుర్చీకి దూరంగా పెట్టుకోండి… అప్పుడప్పుడూ వాటి కోసమైనా లేవడానికి అవకాశం ఉంటుంది… ఫోన్ వచ్చినప్పుడు నడుస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోండి… వర్క్ ఫ్రమ్ హోం (Work from home ) చేసేవారు… అప్పుడప్పుడు నిల్చొని పని చేయండి. మీటింగ్ సమయంలోనూ అవకాశం ఉంటే… నడుస్తూనే విషయం ఏంటో వివరించండి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే…కుర్చీలో కూర్చునేప్పుడు… మీ పాదాలు నేలకు ఆనేలా చూసుకోవాలి… ముందుకు వంగి పని చేయడం, ఒకే భంగిమలో గంటల కొద్దీ కూర్చుంటున్నారేమో చెక్ చేసుకుంటూ ఉండండి…
కూర్చుంటే ఇన్ని సమస్యలా అని లైట్ తీసుకోవద్దు. చిన్న విషయాలకే అతిగా స్పందించడం, ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా దీని వల్లే వస్తాయని హెల్త్ సర్వేలు చెబుతున్నాయి… సో… కూర్చొని పని చేసేవాళ్ళంతా… ఇప్పటికైనా లేవండి.. నడవండి