బీహార్ లో 41 లక్షల ఓటర్లు మిస్సింగ్

Latest Posts Trending Now

41 లక్షల మంది ఎక్కడ ?

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి… దాంతో అక్కడ ఎలక్టోరల్ రోల్స్ మీద ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య వివాదం ముదురుతోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) బీహార్‌లో ఓటర్ల జాబితాను సమీక్షించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను చేపట్టింది. ఇందులో ఏకంగా 41 లక్షల మంది ఓటర్లు… తమ అడ్రస్సులో లేరని తేలింది. అందులో 11,000 మంది అసలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు! ఈ విషయం ఇప్పుడు బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను జూన్ 24 నుంచి మొదలు పెట్టింది ఎన్నికల కమిషన్. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. దాదాపు 7.9 కోట్ల ఓటర్లలో 95.92% మంది వివరాలను ఇప్పటికే సేకరించారు. అంటే దాదాపు 7.48 కోట్ల మంది ఓటర్ల ఫామ్స్ సేకరించారు. కానీ, ఇంకా 41 లక్షల ఫామ్స్ సేకరించాల్సి ఉంది, ఈ రివిజన్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 41.64 లక్షల మంది ఓటర్లు తమ నమోదైన చిరునామాల్లో లేరని తేలింది. వీళ్ళల్లో 12.71 లక్షల మంది* మరణించినట్టు అనుమానిస్తున్నారు.

మరో 18.36 లక్షల మంది బీహార్ నుంచి శాశ్వతంగా వేరే చోటుకు వెళ్లిపోయారు. ఇంకో 5.92 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైనట్టు కనుగొన్నారు. మిగిలిన 11,000 మంది అసలు ఎక్కడున్నారో తెలియడం లేదు, ఈ మిస్సింగ్ ఓటర్లలో కొందరు రోహింగ్యాలు లేదా బంగ్లాదేశ్ పౌరులు కావచ్చని అనుమానిస్తున్నారు. ఇంటింటి సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన కొందరు ఓటర్లుగా నమోదైనట్టు తేలింది. వీళ్ళ పేర్లు తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు మరింత విచారణ జరుగుతోంది. బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో (అరారియా, పూర్ణియా, కతిహార్, కిషన్‌గంజ్ జిల్లాలు), బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వలస వచ్చినవారు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా 47% ఉంది, రాష్ట్ర సగటు 17% కంటే చాలా ఎక్కువ. కొందరు వలసదారులు డొమిసైల్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డుల వంటి ఇండియన్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తీసుకొని ఓటర్ల జాబితాలో చేరారని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఈ విషయం పొలిటికల్ గా పెద్ద ఇష్యూ అయింది. బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి నేతల మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. పేదల ఓట్లు తీసేస్తారా అని ఇండియా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. 2003 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో రివిజన్ జరగలేదు. అప్పటి నుంచి జనాభా మార్పులు, వలసలు, నగరీకరణ వంటి కారణాల వల్ల ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని ఈసీ భావిస్తోంది. ఎస్ఐఆర్ ద్వారా, అర్హత లేని వారి పేర్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని కమిషన్ భావిస్తోంది.

 

సుప్రీంకోర్టు జోక్యం
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టులో ప్రతితిపక్ష నాయకులు కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ID లాంటి సాధారణ పత్రాలను కూడా ECI ఒప్పుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ECI ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, కానీ ఈ డాక్యుమెంట్లను వెరిఫికేషన్‌లో లెక్కలోకి తీసుకుంటామని చెప్పింది. ఈనెల 28న సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ విచారించనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్ ఎన్నికలపై చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశముంది. తూర్పు బీహార్‌లోని అరారియా, పూర్ణియా, కతిహార్ వంటి జిల్లాల్లో ఓటర్ల తొలగింపు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో 2020 ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల మెజారిటీ కంటే ఎక్కువ ఓటర్లు తొలగిస్తారు. దీనివల్ల రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, న్యాయంగా నిర్వహిస్తామని చెబుతోంది, కానీ ప్రతిపక్షాలు దీన్ని ఓటర్లను అణచివేసే కుట్రగా చూస్తున్నాయి. ఆగస్టు 1న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత మరిన్ని ట్విస్ట్‌లు బయటపడే అవకాశం ఉంది.

Also read: కవిత ఇంటికి వాస్తు దోషం వల్లే సమస్యలు

Also read: రష్మికపై మరోసారి కన్నడిగుల ఫైర్

Also read: నా పెళ్లెప్పుడో మీకెందుకు..?

Also read: https://kknlive.com/en/bihar-news/bihar-voter-list-2025-42-lakh-voters-missing-from-addresses/

Tagged

Leave a Reply