Black Friday 2024: ఏంటీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు … ఎలా మొదలయ్యాయి ?

Latest Posts NRI Times Trending Now

Black Friday 2024: ఈ మధ్య మీరు ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా… ఏ యాప్ ని చూసినా… సోషల్ మీడియాలో కూడా Balack Friday sales అంటూ తెగ సందడి చేస్తున్నాయి చాలా కంపెనీలు….. 50% నుంచి 75% దాకా తగ్గింపు ధరలు ఇస్తున్నాయి… Black Friday వచ్చింది అంటే … భారీ భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి.  అమెరికాల సహా అనేక దేశాల్లో ఇప్పటి నుంచి హాలిడే షాపింగ్ సీజన్ మొదలైనట్టే. అసలు ఏంటి బ్లాక్ ఫ్రైడే ?

Black Friday

అమెరికాలో ప్రతి యేటా November చివరి గురువారం నాడు థాంక్స్ గివింగ్ డేని నిర్వహిస్తారు. ఆ తరువాత వచ్చే శుక్రవారం నాడు Black Friday అయింది. అంటే ఈ ఏడాది 2024 నవంబర్ 28న Thanks giving day అయితే… Nov 29న Black Friday వచ్చింది.  థ్యాంక్స్ గివింగ్ డే నాడు… తమ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఇలా తెలిసిన వాళ్ళందరికీ ఏవో గిఫ్ట్స్ ఇస్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటారు. తమకు గిఫ్ట్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా return gifts ఇస్తుంటారు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి Thanks giving day తెల్లారి … Black Friday ని ఉపయోగించుకుంటారు. ఇలా అమెరికాలో మొదలైన ఈ Black Friday గోల వాల్డ్ వైడ్ గా కంటిన్యూ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షించడం కోసం భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి బడా బడా కంపెనీలు.

బ్లాక్ ఫ్రైడే ఏంటి ? ఈ పేరు ఎందుకు వచ్చింది ? (What is black friday)]

Black Friday

Black Friday అనే పదం 1960లో ఫిలడెల్ఫియాలో స్టార్ట్ అయింది. హాలిడే షాపింగ్, Annual Army-Navy Football match కోసం Thanks Giving తరువాత వచ్చే Friday నాడు జనం సిటీలకు భారీగా వస్తారు. దాంతో సిటీ రోడ్లన్నీ వెహికిల్స్ తో నిండిపోతాయి. భారీ ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడుంది. వాటిని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. అందుకే పోలీసులు Black Friday అని పిలవడం ప్రారంభించారు. ఇంకో కథనం ప్రకారం 1869లో US Gold Market లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పుడు గోల్డ్ వ్యాపారులు… ఆ సంక్షోభం నుంచి బయటపడతానికి Black Friday పేరుతో ఆఫర్లు ప్రకటించారని అంటారు. ఇదే Trend ని  మిగతా అన్ని వర్గాల వ్యాపారాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అసలు బ్లాక్ ఫ్రైడే అంటే నెగిటివ్ మీనింగ్. కానీ 1980 నుంచి ఈ డేని రిటైలర్లు తమ వ్యాపారానికి వాడుకోవడం మొదలుపెట్టారు. Thanks giving day తర్వాత అమ్మకాలు పెంచుకునేందుకు కస్టమర్లకు Thanks చెబుతూ Black Friday నాడు భారీగా Discounts ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఫిలడెల్ఫియాలో స్టార్ట్ అయిన ఈ బ్లాక్ ఫ్రైడే సంప్రదాయం ప్రపంచమంతా పాకింది. ఆఖరికి మన ఇండియాలో కూడా బడా బడా మాల్స్ ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి.

Read also : Pre Launch Cheating : బీకేర్ ఫుల్… ప్రీ లాంచ్ మాయలో పడొద్దు !

Black Friday నాడు షాపింగ్ ఎలా ? 

Thanks giving రోజు తెల్లారి కార్మికులకు Official Holidayగా మారింది. దాంతో చాలామంది మందికి షాపింగ్ చేయడానికి టైమ్ దొరికింది.   అమెరికాలోని వాల్ మార్ట్ సహా బడా బడా హోల్ సేల్ రిటైలర్లు ఈ ఛాన్స్ వాడుకోవడం మొదలుపెట్టాయి. Morning Openings, Door buster deals అంటూ కస్టమర్లను ఆకట్టుకోడానికి రక రకాల డిస్కౌంట్స్, డీల్స్ పెట్టాయి. 1990 నాటికల్లా Black Friday ఏడాదిలోనే అతిపెద్ద Shopping dayగా మారింది. అంతేకాదు… థ్యాంక్స్ గివింగ్ రోజున వ్యాపారులు తమకు వచ్చిన లాభ నష్టాలను బ్లాక్, రెడ్ ఎంట్రీలతో సూచిస్తారు. ఇవాళ వచ్చేవి అన్నీ బ్లాక్ ఎంట్రీలే ఉంటాయి. అంటే పెద్ద ఎత్తున లాభాలు వచ్చినట్టు లెక్క. అందుకే బ్లాక్ ఫ్రైడే నాడు మరింత ఎక్కువగా డిస్కౌంట్లు ఇస్తుంటాయి బిగ్ షాపింగ్ మాల్స్.

గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్ (Global shopping Festival)

Thanks giving

1990 నుంచి ఈ బ్లాక్ ఫ్రైడే సంప్రదాయం ప్రపంచమంతటా విస్తరించింది. USA, UK, Canada తో పాటు భారత్ లో కూడా Black friday discounts నడుస్తున్నాయి. Online shoppint platforms కూడా ఈ Trendని ఫాలో అవుతున్నాయి. దాంతో ఇదో పెద్ద గ్లోబల్ ఈవెంట్ గా మారిపోయింది.

Read this also : PAN 2.0: పాన్‌ కార్డ్‌ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?

సైబర్ వీక్ కూడా… (Cyber week )

బ్లాక్ ఫ్రైడే ఒక్క శుక్రవారానికే పరిమితం కాలేదు. చాలా మంది రిటైలర్లు తమ అమ్మకాలను నవంబర్ నెల మొత్తం కంటిన్యూ చేస్తున్నారు. Cyber Monday, Black Friday ఆ తరువాత వచ్చే సోమవారం ఇలా వీక్ అంతా కొనసాగిస్తున్నారు. దాంతో ఇంటర్నెట్ షాపర్లకు Cyber Week పేరుతో ఆఫర్లు అందిస్తున్నారు.

Cyber week

మనోళ్ళకీ షాపింగ్ పండగ  (Shopping festival to NRIs)

అమెరికాలో Thanks giving, Black Friday వచ్చాయంటే ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకీ సందడి మొదలవుతుంది. USలో ఉండే తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కి కాల్ చేసి తమకు కావల్సిన ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయమని చెబుతుంటారు. అందుకే ఇయర్ ఎండ్ లో క్రిస్మస్ సెలవులు, తర్వాత సంక్రాంతి పండగ కోసం ఇండియాకు వచ్చే NRI లు ఇప్పుడు బ్లాక్ ఫ్రైడేలో తక్కువగా రేట్లకు దొరికే గిఫ్టులు తమ వాళ్ళకోసం కొంటుంటారు. మొత్తానికి ఫిలడెల్ఫియాలో మొదలైన బ్లాక్ ఫ్రైడే సంప్రదాయం ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరించింది.

 

ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Click here : Telugu Word Telegram Link

Tagged