పని భారం పెరిగిపోతోంది… మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు… ఆహారం అలవాట్లలో వచ్చిన మార్పులు… ఎక్సర్ సైజెస్, నడక లాంటివి మర్చిపోవడం… దాంతో.. దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డయాబెటీస్, హైబీపీ బాధితులు పెరిగిపోతున్నారు. 30యేళ్ళకే యువతీ, యువకులు జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటే… మరికొందరు పట్టుమని పాతికేళ్ళు రాకుండానే గుండెకు స్టంట్స్ వేయించుకుంటున్నారు. గుండె జబ్బులతో చనిపోతున్నారు కూడా… గతంలో పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే… ఇప్పుడు పల్లెల్లోనూ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
జంక్ ఫుడ్ మోహం… వ్యాయామం మాయం
డయాబెటీస్, హైబీపీ, గుండె జబ్బులకు జంక్ ఫుడ్ ముఖ్య కారణం అవుతోంది. పట్టణాలు, నగరాల్లో ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక… ఇంట్లో కిచెన్ అంటూ ఒకటి ఉందన్న సంగతే మర్చిపోతున్నారు చాలామంది. పొద్దున మొదలు… అర్థరాత్రి దాటాక కూడా బయటి హోటల్స్ నుంచి జంక్ ఫుడ్స్ తెప్పించుకుంటున్నారు. దీనికి తోడు కూల్ డ్రింక్స్, టీలు, కాఫీలకు అయితే లెక్కే లేకుండా పోతోంది. మనం తినే ప్రతి తిండిలోనూ షుగర్, కార్భోహైడ్రేట్ కంటెంట్ తో పాటు స్పైసీ ఉంటోంది. ఇవే అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. గతంలో మన పెద్దలు తిన్న తిండికి తగ్గట్టుగా పనులు చేసేవారు. మనకు కుర్చీలో ఉద్యోగాలు… లేదంటే Work from Home కావడంతో… శరీరంలో అస్సలు కదలికలు ఉండట్లేదు. ఉదయం లేదంటే సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్, ప్రాణాయామం, ధ్యానం, యోగా లాంటి ఎక్సర్ సైజెస్ కూడా చేయట్లేదు.
Read this also : కీర గురించి తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు !
తెలుగు రాష్ట్రాల్లో బీపీ, డయాబెటీస్ బాధితులు
ఈమధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటా ఆరోగ్య సర్వేలు జరిగాయి. వాటిల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. 20,30 యేళ్ళు దాటిన వారిలో బీపీ, డయాబెటీస్ బాధితులు పెద్ద సంఖ్యలో తేలారు. నోటి క్యాన్సర్, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యాధి బాధితులు కూడా బయటపడుతున్నారు.
Read this also : సరిగా నిద్ర పోతున్నారా ?
పొద్దున్నే లేవండి… పొద్దుపోయాక తినకండి
సూర్యోదయం, సూర్యాస్తమయంలో మన శరీరం స్పందిస్తుంది. అందువల్ల ఈ రెండు వేళల్లో ప్రతి రోజూ యోగా, ధ్యానం చేయడం… వాకింగ్, జాగింగ్, ఇతర వ్యాయామం చేయాలి. రోజుకి కనీసం 40 నిమిషాల నుంచి గంట పాటైనా కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సు, ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండేలా చూసుకోవాలి. ఉదయం లేవగానే… డే ప్లానింగ్ వేసుకుంటే… ఎలాంటి టెన్షన్ లేకుండా పనులు జరిగిపోతాయి. నిత్యం ఆరోగ్యం మీద దృష్టిపెట్టాలి. . 30 యేళ్ళు దాటాక తరుచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ రాత్రి 7 లేదా 8 గంటల లోపే భోజనం ముగిస్తే … సగం రోగాలు మాయం అవుతాయని అంటున్నారు డాక్టర్లు. అర్థరాత్రి తిండి బంద్ చేయాలి. జంక్ ఫుడ్ పూర్తిగా మానేసి… రోజూ తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం తొందరగా తినడం, జంక్ ఫుడ్ మానేయడం వల్ల మనం రాత్రి పడుకునే లోపు తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అప్పుడు శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశం ఉండదు. దాంతో డయాబెటీస్, బీపీ, పక్షవాతం, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు మన దగ్గరకు రావు.
ఇలాంటి మంచి జీవన శైలిని మొదలుపెట్టడానికి ఇప్పటికే జనవరి ఫస్ట్… కొత్త సంవత్సరం అంటూ… చాలామంది శపథాలు చేసే ఉంటారు. అవి పాటిస్తే ఓకే. లేదంటే… ఈరోజైనా స్టార్ట్ చేయండి… దాని కోసం ప్రత్యేకంగా మంచి రోజు చూసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా….
Amazon Affiliated Sponsored :
Celevida Protein Powder Drink for Diabetes Management by Dr. Reddy’s | Kesar Elaichi Flavour | No Added sugar | Plant based | For Sugar control, Weight Management & Immunity Support | 400gm
You can buy this product with this Link: https://amzn.to/4hbOrB6
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.
Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK