మన బంధువులు, ఫ్రెండ్స్ లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మనం ఎంతో తల్లడిల్లిపోతాం. అంతేకాదు… అసలు వాళ్ళకి క్యాన్సర్ రావడమేంటని ఆశ్చర్యపోతాం. క్యాన్సర్ ఏ రూపంలో ఎలా వస్తుందో తెలీదు. బయటి కాలుష్యాలే కాదు… ఇంట్లో వస్తువులు కూడా క్యాన్సర్ కు కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వస్తువుల నుంచి వెలువడే రసాయనాలు క్యాన్సర్ ను క్రియేట్ చేస్తున్నాయని చెబుతున్నారు.
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా ? అయితే పారేయండి !
నాన్ స్టిక్ మెటల్స్
నాన్ స్టిక్ మెటల్స్ వస్తువులు చాలామంది ఇళ్ళల్లో కామన్ అయ్యాయి. ఈజీగా… స్పీడ్ గా వంట పూర్తవుతుందన్న ఆలోచనతో Non stick dishes వాడుతున్నారు. ఇవి మన హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ Non stick వస్తువుల తయారీ కోసం Teflon coating వేస్తారు. మనం ఆ పాత్రల్లో వంట చేసేటప్పుడు High temperature వల్ల వాటి నుంచి హానికరమైన perrinitid chemicals రిలీజ్ అవుతాయి. వీటితో Cancer risk బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే Non stick వస్తువులకు బదులు సిరామిక్, కాస్ట్ ఐరన్ లాంటి పాత్రలు వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి : అన్నం తినాలా ? చపాతీ తినాలా ?
సెంటెడ్ క్యాండిల్స్
ఇల్లంతా మంచి సువాసన రావాలని చాలామంది సెంటెడ్ క్యాండిల్స్’ వాడుతుంటారు. కానీ వీటిని వెలిగించడం వల్ల… బెంజీన్, టోల్యూన్ లాంటి డేంజరస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వీటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సెంటెడ్ క్యాండిల్స్ కి బదులు నార్మల్ కొవ్వొత్తులు లేదంటే B Was candles వాడటం బెటర్.
హౌస్ క్లీనింగ్ మెటల్స్
బాత్ రూమ్స్ లతో పాటు ఇంట్లో గచ్చును క్లీన్ చేయడానికి ప్రస్తుతం రకరకాల క్లీనింగ్ మెటల్స్ ని అమ్ముతున్నారు. ఏ బ్రాండ్ కి చెందిన మెటల్స్ అయినా సరే… వాటిల్లో ఫార్మాల్డిహైడ్, క్లోరిన్, బ్లీచ్, అమ్మోనియా లాంటి కెమికల్స్ ఉంటాయట. ఇవి కూడా క్యాన్సర్ రిస్క్ కి కారణం అవుతున్నాయి. వీటికి బదులు బేకింగ్ సోడా, వెనిగర్ లాంటివి వాడటం మంచిది.
ఇది కూడా చదవండి :శీతాకాలంలో ఇమ్యూనిటీకి C విటమిన్
చాపింగ్ బోర్డులు
కూరగాయలు కట్ చేయడానికి గతంలో ఎక్కువగా కత్తిపీటలు వాడేవారు. కానీ ఈ స్పీడ్ యుగంలో తొందరగా పని అవడానికి… నిల్చొని కూడా కట్ చేసుకునేందుకు వీలుగా అందరూ Chaping boards వాడుతున్నారు. ఇవి చెక్కవి అయితే ఫర్వాలేదు. కానీ Plastic chaping Boards వాడటం డేంజర్. కొందరైతే ఆ ప్లాస్టిక్ వి పాడైపోయి… వాటిలో నుంచి ప్లాస్టిక్ బయటకు వస్తున్నా… మమకారం వదులుకోక వాటినే పదే పదే వాడుతున్నారు. ఈ Plastic chaping boards లో ఉండే మైక్రో ప్లాస్టిక్స్…మన ఫుడ్ ఐటెమ్స్ ద్వారా శరీరంలోకి వెళ్తాయి. అలా క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి. అందుకే చెక్కతో తయారు చేసిన చాపింగ్ బోర్డులు వాడటం మంచిది
ప్లాస్టిక్ డబ్బాలు
ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడని ఇల్లు అంటూ ఉండదు. సౌకర్యానికి వాడే వస్తువులతో పాటు ఇంట్లో సామాగ్రి కూడా ప్లాస్టిక్ తో తయారైనవే ఉంటున్నాయి. పోపు గింజల పెట్టెలు కూడా ప్లాస్టిక్ డబ్బాలే. అయితే ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో బిస్పెనాల్ A, థాలేట్స్ లాంటి హానికారక మెటల్స్ ఉంటాయట. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహార పదార్థాలు నిల్వ చేసి వాడితే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. వాటికి బదులు పింగాణీ లేదంటే గాజు సీసాలు వాడటం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మన ఇంట్లో ఉన్న ఈ నాన్ స్టిక్, సెంటెడ్ క్యాండిల్స్, ప్లాస్టిక్ చాప్ బోర్డులు, ప్లాస్టిక్ డబ్బాలను వదిలించుకుంటే… క్యాన్సర్ బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న Telugu word website కి సంబంధించి ఈ కింది లింక్ ద్వారా Telegram Group లో జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి Telugu Word ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్ గా చేసుకోండి. Thank you.