ఎండలో కారు నడుపుతున్నారా? Be Careful!

Latest Posts Top Stories Trending Now

Car Safety Tips in Summer:  వేసవి (Summer Season) వచ్చేసింది. సూర్యుడు భగ్గుమంటున్నాడు. రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు (Heatwave) ఉండొచ్చని వాతావరణశాఖ (Weather Department) ఇప్పటికే హెచ్చరించింది. ఇలాంటి సమయంలో మీ కారును (Car Maintenance) చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత (High Temperature), సాంకేతిక లోపాలతో మంటలు (Car Fire Accidents) చెలరేగే అవకాశాలున్నాయి.

Car firing summer

ఇంజిన్ వేడెక్కకుండా (Engine Overheating Tips)

ఎండాకాలం (Summer Driving Tips) కార్లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఇంజిన్ వేడెక్కడం (Engine Heating). గంటల తరబడి వాహనాలు నడిపితే వైర్లు, పైపులు దెబ్బతిని మంటలు వ్యాపించే ప్రమాదముంది. ఇంజిన్ ఆయిల్ (Engine Oil Level) తక్కువ ఉన్నా వేడెక్కే ప్రమాదముంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

బ్యాటరీ భద్రమేనా? (Car Battery Safety Tips)

కార్లలో బ్యాటరీ ఎక్కువగా వినియోగమయ్యే పరికరాలను అమర్చుకోవడం మంచిది కాదు. కంపెనీ నుంచి వచ్చే పరికరాలు కాకుండా బయట కొని బిగించేవి నాణ్యంగా ఉండవు. ఎండ వేడికి త్వరగా కరిగిపోయి, షార్ట్ సర్క్యూట్ (Short Circuit) జరిగే ప్రమాదం ఉంది. బయటి వేడికి బ్యాటరీ ఉష్ణోగ్రత (Battery Temperature) అమాంతం పెరుగుతుంది.

టైర్లు ఓకేనా? (Car Tyre Safety Tips)

టైర్ల కండిషన్ (Tyre Condition) సరిగా లేకుంటే బ్రేక్ లైనర్లు (Brake Liners) సరిగా పనిచేయక, స్ట్రక్ అయి మంటలు వస్తాయి. అరిగిపోతే వెంటనే మార్చుకోవాలి. సరిపడా గాలి (Tyre Air Pressure) అవసరం ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ప్రమాదమే.

ఫుల్ ట్యాంక్ వద్దు (Full Tank Safety Tips)

చాలా మంది ఇంధనాన్ని ట్యాంక్ నిండా నింపుతారు. సాధారణ సమయంలో ఇబ్బంది లేకున్నా.. ఎండాకాలంలో ఫుల్ ట్యాంక్ వల్ల వేడికి రసాయన చర్య (Chemical Reaction) జరిగి పేలిపోయే ప్రమాదముంది.

EV CARS

ఈవీలతో మరింత జాగ్రత్త (Electric Vehicle Safety Tips)

  • బ్యాటరీ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు (EV Fire Safety) జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించకపోవడం ఉత్తమం.
  • ఈవీలను (EVs) ఎండలో పార్క్ చేయకూడదు. ఛార్జింగ్ (Charging Safety) చేయడం కూడా వద్దు.
  • సిలిండర్లలో ఏదైనా చిన్న లీకేజీ (CNG Leak) ఏర్పడితే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి.

ఏసీ ఎక్కువగా వాడుతున్నారా? (Car AC Safety Tips)

  • ఇంజిన్, రేడియేటర్లలో దుమ్ము చేరడం వల్ల కూలెంట్లో వేడి నీరు చల్లబడదు. కాబట్టి ముందే రేడియేటర్లను శుభ్రం (Radiator Cleaning) చేసుకోవాలి.
  • కూలెంట్ నీరు (Coolant Water) బదులుగా సాధారణ నీరు పోస్తే ప్రమాదముంది.
  • కారులో ఎసీ ఎక్కువగా వాడితే విద్యుత్తు సరఫరా ఎక్కువై వేడెక్కుతుంది. కారును నీడలో (Parking in Shade) పార్క్ చేయాలి.

Car driving

వాహనానికి సర్వీసింగ్ తప్పనిసరి (Car Maintenance Tips)

  • కారును క్రమం తప్పకుండా సర్వీసింగ్ (Regular Car Servicing) చేయించాలి.
  • ఇంజిన్ ఆయిల్, ట్రాన్స్ మిషన్, బ్రేక్, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్స్ (Car Fluids) స్థాయిని సరిచూడాలి.
  • విద్యుత్తు వైర్లు (Electrical Wiring) సరిగా ఉన్నాయో చూడాలి. రాపిడి వల్ల వైర్లు పగిలే ప్రమాదముంది.

అగ్నిమాపక పరికరం ఉండాలి (Car Fire Extinguisher Tips)

కారు కొనేటప్పుడే దాదాపు అన్ని కంపెనీలు అగ్నిమాపక పరికరాన్ని యజమానులకు ఇస్తాయి. కారులో అనవసర వస్తువులను పెట్టకుండా, అగ్నిమాపక పరికరాన్ని (Fire Extinguisher) తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇంజిన్లో పొగలు వస్తే వెంటనే కారును పక్కన నిలిపి, ఇంజిన్ ఆఫ్ చేయాలి. దగ్గర్లోని అగ్నిమాపక కేంద్రానికి (Fire Station) సమాచారం ఇవ్వాలి.

ఎండాకాలం కారు భద్రత (Car Safety in Summer) విషయాల్లో జాగ్రత్తగా ఉండి, ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చు. అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకొని, సురక్షిత ప్రయాణం కొనసాగించండి.

Read this article : వాట్సాప్ హ్యాక్ అయితే కొంప కొల్లేరే !

Read this article : ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు !

 

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Tagged