Whatsapp Hacking : ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది Whatsppను ఉపయోగిస్తున్నారు. కానీ ఈమధ్యకాలంలో (Hacking] సమస్యలు బాగా పెరిగాయి. ఒకే accountను మల్టీపుల్ డివైసెస్‌లో ఉపయోగించడం వల్ల హ్యాకర్లు మోసానికి అవకాశం ఏర్పడుతోంది. ఖాతా హ్యాక్ అయితే, Contacts, Group Messages హ్యాకర్ల చేతికి చేరుతాయి. కొందరు మోసంతో డబ్బులు కోసం Messages పంపుతారు.
వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది?
1. OTP మోసం: హ్యాకర్ మీ Registration code (8-అంకెల OTP) మీదుగా పొందవచ్చు.
2. QR కోడ్ దుర్వినియోగం: Whats app/ Web Desktopని QR కోడ్‌ను స్కాన్ చేయించడం ద్వారా హ్యాకింగ్ జరుగుతుంది.
హ్యాకింగ్ ఎలా గుర్తించాలి ?
అపరిచిత చాట్స్ (chats), ప్రొఫైల్ (profile) మార్పులు, స్టేటస్ (status) లేదా వ్యక్తిగత వివరాల్లో అనుమానాస్పద మార్పులు ఉంటే జాగ్రత్త పడండి.
హ్యాక్ అయితే ఏమి చేయాలి?
– వెంటనే Two step verification ఆన్ చేయండి.
– Linked devisesని తనిఖీ చేసి, అనాధికార యాక్సెస్ ఉంటే “Log Out” చేయండి.
– Accountను Recover చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌తో మళ్లీ రిజిస్టర్ చేయండి.
జాగ్రత్తలు
– OTP మరియు Two factor Pin ఎవరితోనూ షేర్ చేయకండి.
– Profile Photoను “Only Contacts” చూడాలని సెట్ చేయండి.
– అనుమానాస్పద Links, Attachments తెరవకండి.
– ఫోన్‌ను Pin/Finger print lockను ఉపయోగించి safeగా ఉంచండి.
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి!
✅ Registration code లేదా two step verification code Pinని ఇతరులకు షేర్ చేయొద్దు.
✅ వాట్సాప్ అకౌంట్ ను వాడుతున్న ప్రతి ఒక్కరూ two step verificationను తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ PIN Number మర్చిపోతే, ఈమెయిల్ ద్వారా తిరిగి పొందవచ్చు.
✅ Mobile లో వాయిస్ మెయిల్ Password ను సెట్ చేసుకోవాలి.
✅ Settings లో Privacy Advanced protect IP Addressను ఎంచుకొని protect చేసుకోవాలి.
✅మీరు అడగకపోయినా two step verification code Pin లేదా Registration codeని reset చేయడానికి Fake mails/messages రావొచ్చు. అలాంటి Mail లింక్స్ పై క్లిక్ చేస్తే, వాట్సాప్ ఫోన్ నంబర్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది.
✅Bank Accounts information, Wallets, Passwords, Whatsapp UPI పేమెంట్ వివరాలు లాంటి సమాచారం whatsapp లో ఉంచవద్దు.
✅మీరు Whats app తెరవగానే ‘మీ ఫోన్ నంబర్ గల వాట్సాప్ కొత్తపరికరంలో నమోదైంది’ అనే message కనిపిస్తే… మీరు వెంటనే అకౌంట్ ను అన్ని సిస్టమ్స్ లో logout చేయండి
Read also : ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు !
Rad this also : ఈ నీళ్ళు తాగితే రోజంతా ఉత్సాహం !