ఆ ఇన్ ఫ్లూయెన్సర్లని నమ్మితే మునిగిపోతారు

Cyber Alerts Latest Posts Top Stories Trending Now

Betting Apps Cheating : సోషల్ మీడియా వచ్చాక ఇన్ ఫ్లూయెన్సర్ల (Influencers) హవా పెరిగిపోయింది. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లో వీడియోలు పెడుతూ కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోవడంతో ఇక తాము ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాలో ఉన్నారు. సాధారణ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ పదో పరకో డబ్బులు సంపాదించుకుంటే ఫర్వాలేదు. కానీ కొందరు అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పోలీసులకు దొరికిపోయారు ముగ్గురు ఇన్ ఫ్లూయెన్సర్లు.

ఇన్ ఫ్లూయన్సర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. తమని ఫాలో అవుతున్న లక్షల మందిని చూపించుకొని… బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, పార్ట్ టైమ్ జాబ్స్ ప్రమోట్ చేస్తూ అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు.

మీకు అప్పులు ఉన్నాయా ?

మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా ?

అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి … ఇందులో బెట్టింగ్ పెడితే లక్షలు, కోట్లు… సంపాదించవచ్చు అంటూ బురిడి కొట్టిస్తున్నారు ఇన్ ఫ్లూయన్సర్లు.

తమ ముందు భారీగా డబ్బులను పేర్చుకొని వాటిని చూపిస్తూ… యూత్ తో పాటు…మిడిల్ ఏజ్డ్ వాళ్ళని కూడా ఆకట్టుకుంటున్నారు. ఇలా ఇన్ ఫ్లూయన్సర్లు చెప్పిన యాప్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా నిండా మునిగిపోతున్నారు. బయట అప్పులు చేయడమే కాదు… బంగారం, ఇళ్ళు తాకట్టు పెట్టి మరీ డబ్బులు పెట్టి ఊబిలో కూరుకుపోతున్నారు. ఈమధ్య కాలంలో ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల దాదాపు వెయ్యి మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇన్ ఫ్లూయన్సర్లకు ఎంత ముడుతుంది ?

ఇలా బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఇన్ ఫ్లూయన్సర్లకు భారీ మొత్తంలో డబ్బులు ముడుతున్నాయి. ఇన్ ఫ్లూయన్సర్ హర్ష సాయి అయితే 100 నుంచి 500 కోట్ల రూపాయల దాకా తనకు ఆఫర్ వచ్చినట్టు చెప్పాడు. క్యాష్ మాత్రమే కాదు… బైక్ లు, కార్లు. ఇళ్ళు లాంటి ఖరీదైన గిఫ్టులు కూడా ఇన్ ఫ్లూయన్సర్లకు ఇస్తున్నారు సైబర్ నేరగాళ్ళు.

బెట్టింగ్ నుంచి లోన్ యాప్ దాకా ….

ఇన్ ఫ్లూయన్సర్ల మాయలో పడి మొదట బెట్టింగ్ కి దిగుతున్న యూత్… వాటికి బానిసలై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈజీ మనీ కోసం ఇన్ ఫ్లూయన్సర్లను గుడ్డిగా ఫాలో అవుతున్నారు. చేతిలో డబ్బులు అయిపోతే… ఇన్ ఫ్లూయన్సర్లు చెప్పిన లోన్ యాప్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఆ యాప్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా రూ.10 వేల నుంచి 5 లక్షల దాకా రుణాలు ఇస్తున్నాయి. వడ్డీలకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. వాటిని తీర్చలేక… యూత్ మాత్రమే కాదు… మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇన్ ఫ్లూయన్సర్లపై సజ్జనార్ అస్త్రం – కేసులు

 

బెట్టింగ్, లోన్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లూయన్సర్లపై ఆర్టీసీ ఎండీ, IPS సజ్జనార్ సీరియస్ గా ఉన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారనీ, చట్టాన్ని ఖాతర్ చేయడం లేదని ఇన్ ఫ్లూయన్సర్లపై ఫైర్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై X ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు ఈ IPS అధికారి. బెట్టింగ్ యాప్స్ నిషేధంపై X (Twitter)లో #SayNoToBetting Apps పేరుతో ఉద్యమం చేపట్టారు. ఇప్పటికే ముగ్గురు ఇన్ ఫ్లూయన్సర్లపై కంప్లయింట్ ఇవ్వడంతో వాళ్ళల్లో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్, లోన్ యాప్స్ లో చేరాలని ప్రమోట్ చేసే ఇన్ ఫ్లూయన్సర్లను unfollow చేయాలనీ, వాళ్ళపై పోలీస్ కేసులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు సజ్జనార్. యువతను కాపాడుకోవడం మన బాధ్యత. అందరూ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలని కోరుతున్నారు.

ముగ్గురిపై కేసులు – ప్రభుత్వం సీరియస్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ముగ్గురు ఇన్ ఫ్లుయెన్సర్లపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేశారు. సూర్యాపేటకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ తో పాటు, హర్ష సాయిపైనా కేసు పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు, నిర్వహణదారులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కొందరు సినీ నటులు కూడా వీటిని ప్రమోట్ చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో ఉద్యమం, పోలీసుల యాక్షన్ తో కొందరు ఇన్ ఫ్లూయెన్సర్లు దిగి వస్తున్నారు. క్షమాపణలు చెబుతూ వీడియోలు పెడుతున్నారు. గతంలో తాము పెట్టిన వీడియోలను తొలగిస్తున్నారు.

Read this also : వాయిస్ క్లోనింగ్ తో బురిడీ !

Read this also : ఒబెసిటీతో గజినీలు అవుతారు !

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Tagged