సినీ నటి కల్పికా గణేశ్ పై మరో కేసు నమోంది. ఇప్పటికే ప్రిజం క్లబ్ లో జరిగిన రచ్చతో కేసు ఎదుర్కొంటోంది. లేటెస్ట్ గా మరో సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను బూతులు తిట్టిందనీ, ఆన్‌లైన్‌లో వేధిస్తోంది అని కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్పికా గణేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని బూతులు ఉపయోగించిందని బాధితురాలు కీర్తన తన ఫిర్యాదులో తెలిపింది. సోషల్ మీడియాలో తన గురించి అభ్యంతరకర స్టేటస్‌లు పెట్టడంతో పాటు, ఇన్‌బాక్స్‌కు మెసేజ్‌లు పంపి దారుణంగా మాట్లాడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులకు సంబంధించి కొన్ని స్క్రీన్‌షాట్లను కూడా కీర్తన పోలీసులకు ఆధారాలుగా సమర్పించింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత నటి కల్పికా గణేశ్ పై కేసు పెట్టారు. ఐటీ చట్టం 2000-2008లోని సెక్షన్ 67, అలాగే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్లు 79, 356 కింద ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ప్రిజం పబ్ వివాదంలో కల్పికా గణేశ్ పై కేసు ఫైల్ అయింది. లేటెస్ట్ గా సైబర్ వేధింపుల ఆరోపణలతో కల్పిక మరోసారి చిక్కుల్లో పడింది. వరుస ఘటనలతో ఆమె కెరీర్‌పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.
Read also : మంగ్లీ మీద ఎందుకంత కోపం !
Read also: 498 A టీ కేఫ్: భార్య కేసులపై అత్తారింటి ముందు నిరసన : బేడీలతో టీ అమ్ముతున్న భర్త!
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/