CREDIT CARDS 8

మీ క్రెడిట్ కార్డు జాగ్రత్త…ముంచేస్తారు !

Credit Cards Cyber Alerts Latest Posts Trending Now

Credit Card Scams : ఈమధ్య కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. దాదాపు 80 నుంచి 90 శాతం మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్ళ గత కొన్ని రోజులుగా Credit Cards వాడే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. Credit Card holders ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోతే కొంప కొల్లేరవుతుంది.

Cyber scams

కొత్త కార్డు యాక్టివేషన్ పేరుతో…

బ్యాంక్ అధికారి అని చెప్పుకొని కాల్స్ చేస్తున్న ఫేక్ గాళ్ళు… క్రెడిట్ కార్డులను యాక్టివేట్ చేస్తామంటూ కాల్స్ చేస్తున్నారు. పేరు, అడ్రెస్ తో పాటు బ్యాంక్ డిటైల్స్, క్రెడిట్ కార్డు వివరాలు అడుగుతున్నారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు ద్వారా లక్షల విలువైన లావాదేవీలు చేస్తున్నారు. అందుకే క్రెడిట్ కార్డులు యాక్టివేషన్ పేరుతో వచ్చే కాల్స్ ని నమ్మవద్దు.
మీ లావాదేవీలు బాగా ఉన్నాయి… అందుకే మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోసగాళ్ళు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈమధ్య ఇలాగే వచ్చిన కాల్ కి అందులో నిజా నిజాలు తెలుసుకోకుండా బాధితుడు వివరాలు చెప్పడంతో… కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఫోన్ హ్యాక్ చేశారు. దాదాపు 2 లక్షల లావాదేవీలు చేసినట్టు మెస్సేజ్ వచ్చింది. క్రెడిట్ కార్డు పరిమితిని పెంచడంపై చాలా బ్యాంకులు మెస్సేజ్ లు పంపుతున్నాయి. ఒక నెంబర్ ఇస్తున్నాయి. దానికి LIMIT పెంచమని మెస్సేజ్ పెడితేనే పెంచుతాయి. కానీ బ్యాంకులు ఫోన్ కాల్స్ చేయడం లేదు.

CREDIT CARDS 5

Read also : ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా ?

ఎలా మోసాలు చేస్తున్నారంటే !

😨 Fishing Scam: సైబర్ క్రిమినల్స్ … మోసం చేయడానికి e-Mails, Websiteలు ఉపయోగించి క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుంటున్నారు.

😨 Skimming Scam: ATM లేదా Point of Sale టెర్మినల్స్ దగ్గర కూడా క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేయడానికి ప్రత్యేకంగా పరికరాలు install చేస్తున్నారు. కార్డ్ రీడర్లకు పెడుతున్న కొన్ని equipments విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ట్యాంపరింగ్ చేసే అవకాశం swiping machines దగ్గరే ఎక్కువ. సో… జాగ్రత్తగా ఉండండి.

😨 Cart not present Scam: Online లేదంటే ఫోన్ల ద్వారా కొనుగోళ్ల కోసం వాడిన క్రెడిట్ కార్డు వివరాలను సేకరించి మోసాలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. మనకు తెలియకుండా Credit Card అకౌంట్స్ తెరవడానికి మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

Cyber crimes

Read also : క్యాన్సర్ కి చెక్ పెట్టే లీచి పండ్లు

బీ కేర్ ఫుల్

👉 మీ క్రెడిట్ కార్డులో… మీకు తెలియకుండా ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగినట్టు మెస్సేజ్ వస్తే… వెంటనే బ్యాంక్ అధికారులకు కంప్లయింట్ చేయాలి. అలాగే ATM, ఇతరత ఏరియాల్లో మీ PIN వాడుతున్నప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

👉 Online Shopping చేస్తున్నప్పుడు ఆయా websites చట్ట బద్ధమైనవేనా కాదా అన్నది కూడా గుర్తించాలి.

👉 క్రెడిట్ కార్డు లావాదేవీల కోసం Public Wifi వాడటం కరెక్ట్ కాదు. ఆ network అంత సురక్షితం కాదు. కొందరు కేటుగాళ్ళు Public wifi ని హ్యాక్ చేసి… మన మొబైల్ ని తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు లావాదేవీలు, షాపింగ్ కి అయినా సరే… మీ Mobile data మాత్రమే ఉపయోగించండి.

👉 ఎవరైనా వ్యక్తులు బ్యాంక్ సిబ్బందిగా చెప్పుకొని… మీ వ్యక్తిగత లేదా క్రెడిట్ కార్డు సమాచారం గురించి ఫోన్ లో అడుగుతున్నారంటే అనుమానించాల్సిందే. అలాంటి ఈ-మెయిల్స్ వచ్చినా వాటికి స్పందించవద్దు. వెంటనే ఆ e-mail id ని బ్లాక్ చేయండి.

👉 మీరు ఊహించని విధంగా Credit Card offers చెబుతున్నా… కార్డ్ లిమిట్ పెంచుకోవడం, లేదా డిస్కౌంట్స్ ఇస్తామని నోటిఫికేషన్లు, ఫోన్లు వచ్చినా అప్రమత్తంగా ఉండండి. అలాంటి మెస్సేజెస్, కాల్స్ కి స్పందించవద్దు. మీ కార్డు యాక్టివేట్ చేస్తామంటే అస్సలు నమ్మవద్దు. పాస్ వర్డ్స్ లాంటివి ఇతరులకు చెప్పొద్దు. క్రెడిట్ కార్డు ఒక్కసారిగా బ్యాంక్ నుంచి డిస్ ప్యాచ్ అయ్యాక యాక్టివేట్ చేసుకోవాల్సింది మనమే. కానీ బ్యాంక్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాల్స్ చేయరని గుర్తుంచుకోండి.

👉 క్రెడిట్ కార్డు సమాచారాన్ని Onlineలో, Phoneలో షేర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది క్రెడిట్ కార్డు బిల్లు వచ్చాక చెల్లిస్తారు. కానీ ఆ నెలలో జరిగిన లావాదేవీలు చెక్ చేసుకోరు. కానీ ఇలా చెక్ చేసుకోకపోతే చాలా నష్టపోయే ఛాన్సుంది. మీకు తెలియకుండా లావాదేవీలు జరిగినట్టు Credit Card statement లో గుర్తిస్తే వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

👉 Online accountsకి సంబంధించిన Pass Words చాలా పకడ్బందీగా, చాలా ప్రత్యేకంగా పెట్టుకోవాలి.. క్రెడిట్ కార్డు మోసం జరిగినట్టు గుర్తిస్తే మాత్రం 1930కు ఫిర్యాదు చేయాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఫిర్యాదుల కోసం… sanchar sathi అనే మొబైల్ యాప్ కూడా వచ్చింది. ఇందులో కంప్లయింట్ చేయడం చాలా ఈజీ. అందుకే వెంటనే ఈ LINK ద్వారా SANCHAR SATHI మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Tagged