రోజూ 10,000 అడుగులు నడవలేకపోతున్నామని బాధపడుతున్నారు. అయితే, కనీసం 7,000 అడుగులైనా నడవండి! ఇది గుండె జబ్బులు, డయాబెటీస్, మతిమరుపు లాంటి దీర్ఘకాల రోగాల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని ప్రపంచవ్యాప్త పరిశోధనల్లో తేలింది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌లో పబ్లిష్ అయినా ఓ స్టడీ ప్రకారం, రోజూ 2,000 అడుగులు నడిచేవారితో పోలిస్తే, 7,000 అడుగులు నడిచే వారిలో అకాల మరణ ప్రమాదం 47 శాతం, గుండె జబ్బులు, డయాబెటీస్, మతిమరుపు ప్రమాదం 25 నుంచి 38 శాతం తగ్గుతోంది. అయితే, 10,000 అడుగులు నడవడం మానేయాలని కాదు. అది కొనసాగిస్తే మరింత మంచిది.
7,000 అడుగుల కంటే ఎక్కువ నడిచే వారికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. గతంలో 1.6 లక్షల మందిపై జరిగిన 31 స్టడీస్ లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కనీసం 4,000 అడుగులు నడిచినా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ, మనలో చాలామంది రోజూ 2,500 నుంచి 3,500 అడుగులు మాత్రమే నడుస్తున్నట్లు స్టడీస్ చెబుతున్నాయి.
నడక వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొవ్వు స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి రోగాల ప్రమాదం తగ్గుతుంది. అందువల్ల నడకను తేలిగ్గా తీసుకోకండి! రోజూ కాళ్లకు పని చెప్పి, కనీసం 7,000 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా, సంతోషంగా జీవించండి!
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
PURCHASE THESE SHOES WITH THIS LINK : https://amzn.to/3UlkTaA
PURCHASE THESE SHOES WITH THIS LINK : https://amzn.to/40Y7pFu
PURCHASE THESE SHOES WITH THIS LINK: https://amzn.to/4fuZZzA
Read also : సాయంకాలం నడక మంచిదే !
Read also : TOP 6 MOBILES UNDER 20K – AMAZON FREEDOM SALE
Read also : పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/