అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా వివిధ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే 40 యేళల్లో మొదటిసారిగా ట్రంప్ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న(సోమవారం) ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకార కమిటీ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉంది. అయితే అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా మంచు పడుతుండటంతో పాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అవుట్ డోర్‌లో కాకుండా US Capitalలోనే చేస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు.
‘ప్రమాణ స్వీకారం రోజైన సోమవారం నాడు వాషింగ్టన్‌లో విపరీతమైన చలి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. టెంపరేచర్స్ కనిష్టంగా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. గరిష్టంగా మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌ను టచ్ చేసే ఛాన్సుంది. అందుకే నా ప్రారంభోత్సవ ప్రసంగం, అలాగే ఇతర speaches అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపల జరుగుతాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు ఇబ్బంది పడరాదు. ఉష్ణోగ్రతలు మైనస్ రికార్డు స్థాయికి చేరుకుంటాయి. వణికించే మంచు తుపానుతో ప్రజలు ఇబ్బంది పడటం నాకిష్టం లేదు’అని ట్రూత్ సోషల్ పోస్ట్ లో ట్రంప్ తెలిపారు. 1985లో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కూడా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన టైమ్ లో చలి తీవ్రత వల్ల అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపలే ప్రారంభోత్సవం జరిగిందని ట్రంప్ గుర్తు చేశారు.
Read this also : అమెరికాలో Tik Tok బంద్ !
ట్రంప్ ప్రమాణానికి మాజీ అధ్యక్షులు హాజరు
ఈనెల 20న జరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమల హ్యారీతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి W బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటున్నారు. వీళ్ళల్లో ఒబామా తప్ప మిగిలిన వాళ్ళంతా భార్యతో కలసి హాజరవుతున్నారు. వివిధ దేశాల అధినేతలు, VVIPలు, ప్రముఖులు కూడా పాల్గొంటారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. అల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్‌తో పాటు IT, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్‌బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) లాంటి ప్రపంచ కుబేరులు ముగ్గురు ఒకే వేదికపై కనిపిస్తారు.
మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK