వాళ్ళని నమ్మి పెట్టుబడి పెడితే … అంతే !

Cyber Alerts Latest Posts Personal Finance Top Stories Trending Now

 Fake Fin Influencers: సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఇన్ ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఆర్థిక సలహాలు ఇచ్చే… Fin-Influencers మహా డేంజర్ అంటోంది సెబీ. ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా… ఏవో షేర్లు కొనాలంటూ రికమండ్ చేస్తూ… జనాన్ని నిండా ముంచుతున్నారు కొందరు కేటుగాళ్ళు. అందుకే ఏకంగా 70 వేల మంది ఫేక్ ఇన్ ఫ్లుయెన్సర్లపై నిషేధం విధించింది.

Fake influencers

ఈ షేర్లలో పెట్టుబడి పెడితే… మీకు డబుల్, ట్రిపుల్ రెట్లు ఆదాయం వస్తుంది…

సాయంత్రం లోగా ఈ స్టాక్స్ కొనండి… ఆ స్టాక్స్ కొనండి… అంటూ

టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సలహాలు ఇస్తున్నారు… కొందరు ఉచితంగా ఇస్తుంటే… మరికొందరు కమీషన్లు తీసుకుంటూ బిజినెస్ చేస్తున్నారు. ఇంకొందరు అవతలి కంపెనీ నుంచి ఎంతో కొంత remuneration తీసుకొని… ఆ స్టాక్స్ అంటగడుతున్నారు. ఇలా గుర్తింపు లేకుండా… అసలు ఎలాంటి అర్హత లేకున్నా స్టాక్ మార్కెట్లపై సలహాలు ఇస్తూ సామాన్యులను నిండా ముంచుతున్న Fake Influencersపై SEBI సీరియస్ అవుతోంది. You tube, Instagram, Twitter, Face Book లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఉన్న వేల సంఖ్యలో హ్యాండిళ్లు, పోస్టులను తొలగించింది సెబీ. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న వాళ్ళని నమ్మిస్తూ, ఈ Fake Fin Influencers సొమ్ము చేసుకుంటున్నారని.. సెబీ దగ్గర నమోదు కాని అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు పెద్ద ముప్పుగా మారారని నమ్ముతోంది. దాదాపు 70 వేల మంది Fin Influencers సోషల్ మీడియా అకౌంట్స్ ని క్లోజ్ చేయించింది. ఫిన్-ఇన్ ఫ్లూయెన్సర్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా తప్పుడు సలహాలు ఇచ్చేవారిని గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని గుర్తింపు పొందిన అడ్వైజర్లు, అనలిస్టులను కోరుతోంది సెబీ.

అడ్డగోలు ప్రకటనలకు చెక్

గూగుల్, మెటా, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇచ్చే బిజినెస్, స్టాక్స్ కి సంబంధించిన ప్రకటనలపైనా సెబీ ఆంక్షలు విధిస్తోంది. ఈ సంస్థలు సెబీ దగ్గర నమోదు చేసిన ఈ-మెయిల్స్, మొబైల్ నెంబర్లను ఆ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి తప్పనిసరిగా ఇవ్వాలి. దాంతో ఆ కంపెనీలు నిజమైనవా… బోగస్ వా అనేది నిర్ణయించుకున్న తర్వాతే తమ ప్లాట్ ఫామ్స్ పై ప్రకటనలు ఇవ్వాలని సోషల్ మీడియా దిగ్గజాలను సెబీ కోరుతోంది.

ఆర్థికంగా ఎలాంటి అవగాహన లేని Influencers మాటలు నమ్మవద్దని కోరుతోంది సెబీ. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వచ్చే లింకులు, apkలను ఓపెన్ చేయొద్దనీ… అవి సైబర్ క్రిమినల్స్ పంపుతున్నారని హెచ్చరిస్తోంది.

Read this also : ఆ ఇన్ ఫ్లూయెన్సర్లని నమ్మితే మునిగిపోతారు

Read this also : వాయిస్ క్లోనింగ్ తో బురిడీ !

 

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.

Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link

తెలుగు వర్డ్ Telegram Link CLICK HERE FOR TELEGRAM LINK

Tagged