ప్రియుడితో కలిసి తల్లినే చంపిన బాలిక

Latest Posts Trending Now

జీడిపెట్ల పరిధిలో దారుణం

మానవ సంబంధాలు మట్టికలిసిపోతున్నాయి అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. పట్టుమని 16 ఏళ్లు కూడా లేవు. అప్పుడే ప్రేమ..పెద్దవాళ్లపై పగ. ప్రేమకు అడ్డొస్తుందనే కోపంతో కని పెంచి పెద్దచేసిన కన్నతల్లినే మట్టుబెట్టిందో కూతురు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో జరిగిందీ దారుణ ఘటన. ప్రియుడితో కలసి తన కన్నతల్లిని హతమార్చిందో బాలిక. ఈ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎల్బీనగర్‌లో నివాసముండే సట్ల అంజలి కూతురు పదో తరగతి చదువుతోంది. ఆ బాలికకు శివ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. విషయం పెద్దవాళ్లకు తెలియడంతో పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి మందలించింది. దీంతో పెద్దవాళ్లకు తెలియకుండా ఈనెల 19న ఇంట్లో నుంచి మైనర్ బాలిక ప్రియుడు కలిసితో వెళ్లిపోయింది. దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పెట్టారని తెలియడంతో ప్రియుడు మైనర్ బాలికను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే తల్లి తన ప్రేమకు అడ్డొస్తుందని బాలిక కోపం పెంచుకుంది. తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది. ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు.

నల్గొండ నుంచి ఎల్బీనగర్ కు వచ్చిన ప్రియుడు శివ.. బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక తల్లి అంజలి ఇంట్లో పూజ చేస్తుండగా.. వెనుకనుంచి శివ దాడి చేశాడు. బెడ్ షీట్ తో అంజలి ముఖాన్ని కప్పేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలో వెళ్లడంతో చనిపోయింది అనుకున్నారు. అదే సమయంలో ట్యూషన్ నుంచి మృతురాలి చిన్న కూతురు ఇంటికి వచ్చింది. అమ్మ పూజ చేస్తూ కింద పడిపోయిందని ఆమెను నమ్మించారు. మాయమాటలు చెప్పి ఆమెను బయటకు పంపి మరోసారి ప్రియుడిని పిలిపించింది బాలిక. ప్రియుడితో పాటు అతని తమ్ముడు కూడా ఈ హత్యలో భాగమయ్యాడు. నేలపై పడున్న బాలిక తల్లిపై సుత్తితో గట్టిగా కొట్టి చంపేశారు. ఈ హత్య సమయంలో బాలిక ప్రియుడు.. మృతురాలికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. తన తల్లిని కిరాతకంగా హత్య చేస్తున్న సమయంలో ఏ మాత్రం జాలి లేకుండా ప్రవర్తించింది కూతురు. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు. చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమకారిణి. అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్‌గా ఉన్నారు. వీళ్లది తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం. అలాంటి కుటుంబంలో పుట్టిన ఈ బాలిక ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురూ మైనర్లే. బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారైన ప్రియుడు, అతని తమ్ముడు కోసం గాలిస్తున్నారు.

Also read: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’కు బ్రేక్

Also read: ‘కన్నప్ప’ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్

Also read: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చాబహార్ పోర్ట్ పై ఎఫెక్ట్

Also read: https://vaartha.com/jeedimetla-crime-news/crime/506771/

Tagged

Leave a Reply