మెగా హీరోలకు కలిసొచ్చిన నెల.. హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుందా?

ET World Latest Posts Top Stories Trending Now

మెగా హీరోల సినిమాలంటే ఒక హైప్ ఉంటుంది. అందులోనా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు రిలీజవుతుంటే ఫ్యాన్స్ కు పండగే. ఇక పవన్ కల్యాణ్ కుండే క్రేజ్ చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే డిప్యూటీ సీఎంగా బీజీగా ఉన్నారు కానీ.. పవన్ కల్యాణ్ సినిమా రిలీజవుతుంటే ఆ హంగామానే వేరు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు రిలీజవుతోంది. జూలై 24న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్ . ఎందుకంటే జులై నెల మెగా హీరోలకు బాగా కలిసొచ్చిన నెల. గతంలో మెగా హీరోలు సినిమాలు ఈనెల్లోనే రిలీజై బ్లాక్ బ్టస్లర్ హిట్ కొట్టాయి. అయితే ఈ సెంటిమెంట్ హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుద

జూలైలో విడుదలైన మెగా హీరోల సినిమాలు ఏవంటే..?

‘తొలిప్రేమ’తో తొలి విజయం (Toli Prema)

పవన్ కళ్యాణ్ సినిమా ‘తొలి ప్రేమ’ 1998 జూలై 24న విడుదలైంది. దానికి ముందు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘సుస్వాగతం’, ‘గోకులంలో సీత’ సినిమాలు పవన్ కల్యాణ్ మంచి హిట్ నిచ్చాయి. అయితే
‘తొలి ప్రేమ’ మాత్రం పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ ను స్టార్ గా నిలబెట్టింది. జూలై నెలలో విడుదలైన పవన్ కళ్యాణ్ మరో సినిమా ‘తమ్ముడు’. అది జూలై 15 1999లో రిలీజ్ అయింది. ఇది ఆల్ టైం హిట్టే. సో.. జులై నెల పవన్ కల్యాణ్ కు అలా కలిసొచ్చింది.

చిరు ‘ఇంద్ర’ కూడా అదే రోజు!

‌‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‌’ఇంద్ర’ సినిమా కూడా జూలై 24న విడుదల అయింది. ఫ్యాక్షన్ సినిమాలు తెలుగులో వరుస విజయాల సాధిస్తున్న సమయంలో… ఫ్యాక్షన్ కథకు మంచి మెసేజ్ జోడించిన ఈ సినిమా చిరంజీవికి భారీ హిట్ ని అందించింది. చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ జూలై 27న థియేటర్లలోకి వచ్చింది.‌ ఈ సినిమా ఎంత హిట్టయిందో అందరికీ తెలుసు. సో. జులై నెల చిరంజీవికీ కలిసొచ్చింది.

చరణ్ ‘మగధీర’ జులైలోనే!

‘చిరుత’ సినిమాతో మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ కూడా జూలైలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. హీరోగా చరణ్ రెండో సినిమా ‘మగధీర’. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ జూలై 31న విడుదల అయింది. రామ్ చరణ్ కు కూడా జులై నెల సెంటిమెంట్ వర్కవుట్ అయింది. అలాగే మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, పవన్ కల్యాణ్ కలిసిన నటించిన ‘బ్రో’ సినిమా జూలై 28న విడుదల అయితే… మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమా జూలై 21న విడుదల అయింది. అలా మెగా ఫ్యామిలీకి జూలై బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

ఈ నెలలో విడుదలైన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మరి హరిహర వీరమల్లు సినిమాకు కూడా జులై నెల సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also read: ఎన్ని సర్జరీలైనా చేయించుకుంటా.. నాఇష్టం: శృతిహాసన్

Also read: పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య

Also read: పవన్ ఫ్యాన్స్ బీ రెడీ.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Also read: https://in.bookmyshow.com/movies/mumbai/hari-hara-veera-mallu/ET00308207

Tagged