India Olympic Olympic bid

భారత్ ఒలింపిక్ బిడ్ కు పాకిస్తాన్ అడ్డు

NRI Times Top Stories Trending Now

అప్పుల ఊబిలో కూరుకుపోయి… రోజువారీగా ప్రభుత్వాలు నడపలేక విదేశాల దగ్గర అడుక్కుతినే పరిస్థితి ఉన్నా… భారత్ మీద మాత్రం పాకిస్తాన్ కుట్రలు మానుకోవట్లేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళల్లో భారత్ ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు పెడుతోంది. ప్రపంచంలో ఇండియా (India) మాటకు విలువ రోజు రోజుకీ పెరుగుతోంది. కానీ పొరుగునున్న పాకిస్తాన్ (Pakistan) పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. IMF, వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తేనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉంది. అయినా సరే … ఇండియా మీద అక్కడి పాలకుల కుక్కబుద్ది మారడం లేదు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… భారత్ 2036లో ఒలింపిక్ (Olympics 2036) క్రీడల నిర్వహణ కోసం బిడ్ వేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే కాన్సెంట్ లెటర్ కూడా అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్యకు పంపింది. కానీ తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ లో (Champions Trophy) ఇండియా పాల్గొనడం లేదన్న అక్కసుతో భారత్ ఒలింపిక్ బిడ్ ని అడ్డుకోవాలని కుయుక్తులు పన్నుతోంది పాకిస్తాన్.

Champions-Trophy

పాకిస్తాన్ లో ఆడేది లేదు : టీమిండియా

ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆడేందుకు రోహిత్ సేన పాకిస్తాన్ వెళ్ళడానికి నిరాకరించింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కి BCCI తెలిపింది. దాంతో ఐసీసీ తటస్థ వేదికల కోసం ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ లో భారత ఆటగాళ్ళకు భద్రత ఉండదని అందరికీ తెలుసు. అందుకే గత కొన్నేళ్ళుగా భారత్ – పాకిస్తాన్ (India vs Pakistan ) మ్యాచులన్నీ తటస్థ వేదికలపైనే జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సమరానికి ఎంతో క్రేజ్ ఉంటుంది. క్రికెట్ బోర్డులకు కాసుల పంట పండుతుంది. అందుకే టీమిండియాను తమ దేశానికి రప్పించడానికి పాకిస్తాన్ నానా విధాలుగా ప్రయత్నించి విఫలమైంది. నిత్యం ఎక్కడ బాంబు పేలుతుందో… ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్ లో ఉన్నాయి. సామాన్య జనమే కాదు పోలీసులు, VIP లకు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి టైమ్ లో భారత జట్టుకి పాకిస్తాన్ ఎంతవరకు భద్రత కల్పిస్తుందన్నది అనుమానమే. అందుకే రోహిత్ సేన పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ICC కి ఇదే విషయాన్ని తెగేసి చెప్పింది.

భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్ర

భారతీయ క్రికెటర్లను తమ దేశానికి పంపడం లేదన్న అక్కసుతో ఇండియా ఒలింపిక్ బిడ్ ను వ్యతిరేకించాలని పాకిస్తాన్ డిసైడ్ అయింది. 2036లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని భారత్ ఇప్పటికే IOC కి కాన్సెంట్ లెటర్ ఇచ్చింది. అందుకే పాకిస్తాన్ అంతర్జాతీయ ఒలింపిక్ మండలికి భారత్ కు వ్యతిరేకంగా లెటర్ రాయాలని నిర్ణయించింది. క్రీడా పోటీలను భారత్ రాజకీయం చేస్తోంది అనే యాంగిల్ లో భారత్ కు వ్యతిరేకంగా లెటర్ రాయాలని పాకిస్తాన్ పాలకులు నిర్ణయించారు. అంతేకాదు భారత్ కు ఒలింపిక్ బిడ్ దక్కకుండా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేయాలని కూడా పాక్ కుట్రలు పన్నుతోంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళ్తానన్నట్టుగా… ముందు తన ఇంటిని చక్కదిద్దుకోలేని పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ముందు సాయం కోసం దేబిరిస్తున్న పాకిస్తాన్… భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంటోంది. పాకిస్తాన్ కుట్రలతో భారత్ కు వచ్చే నష్టమేమీ లేకపోగా… అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు… అత్యంత ప్రమాదకర జాబితాల్లో చేరకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ కి ఉంది.

Tagged