ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చి రెండు రోజులు దాటింది. సిచ్యుయేషన్ ఇప్పుడు కాస్త బెటర్ గా కనిపిస్తోంది. అయినా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పటికీ బయటి ప్రపంచానికి కనిపించడం లేదు. దీనిపై రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఇదే విషయంపై ఖమేనీ ఆర్కైవ్స్ ఆఫీస్ హెడ్ మెహదీ ఫజైలీని క్వశ్చన్ చేయగా ఆయన కూడా పొడిపొడిగా ఆన్సరిచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇరాన్ లో జరిగిన ప్రోగ్రామ్ లో మెహదీని.. మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. “ఖమేనీ ఎలా ఉన్నారు? ఆయన గురించి ప్రజలు వర్రీ అవుతున్నారు? ఖమేనీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పగలరా” అని అడిగారు. దీనికి మెహదీ రెస్పాండ్ అవుతూ.. తనను ఈ ప్రశ్న చాలా మంది అడుగుతున్నారని అన్నారు. “ఖమేనీ కోసం మనందర ప్రార్థన చేద్దాం. సుప్రీం లీడర్ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటైన సిబ్బంది వారి డ్యూటీ చేస్తున్నారు. దేవుడు అనుగ్రహిస్తే.. ప్రజలంతా కలిసి త్వరలోనే ఖమేనీతో విక్టరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు” అని చెప్పారు.
ఖమేనీ మర్డర్ కు ప్లాన్?:
ఇరాన్ లో కీలక అంశాలపై ఫైనల్ డెసిషన్ ను సుప్రీం లీడరే తీసుకుంటారు. అయితే వార్ నేపథ్యంలో ఖమేనీ కొద్దిరోజుల కిందట సేఫ్ ప్లేస్ కు వెళ్లారు. సిగ్నల్స్ కు అందకుండా.. కమ్యూనికేషన్ కు దూరంగా సురక్షిత బంకర్ లో తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు. ఇందుకు ఇజ్రాయిల్ కారణమని సమాచారం. ఖమేనీని ఎలాగైనా లేపేయాలని ఆ దేశం ట్రై చేస్తోంది. సీజ్ ఫైర్ తర్వాత కూడా ఈ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందుకే ఖమేనీ ఎక్కడున్నారో ఇప్పటికీ బయటపడలేదని భావిస్తున్నారు. ఆయన సెక్యూరిటీ ప్రొటోకాల్స్ ను కూడా మరింత పెంచారు. కేవలం కొద్దిమందితో మాత్రమే ఖమేనీ టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది.
Also read: జూబ్లీహిల్స్ లో నందమూరి వారసురాలు పోటీ
Also read: చైనా, పాకిస్తాన్ కు భారత్ ఝలక్
Also read: హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేశారా?