అరెస్ట్ చేయకుండా జ‌గ‌న్ పక్కా ప్లాన్

Latest Posts Trending Now

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం.
ఇటీవల జగన్ జనంలోకి బాగా వెళ్తున్నారు,
రైతుల సమస్యల కోసం, పార్టీ కార్యకర్తల కోసం పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇండోసోల్ పరిశ్రమకు వ్యతిరేకంగా కరేడు గ్రామానికి కూడా వస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఈ పర్యటనల వెనక ఒక పెద్ద ప్లాన్ ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
మద్యం స్కామ్ లో జగన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసి,
ఆ లోపు జనంలో సానుభూతి పొందడానికి ఈ పర్యటనలు చేస్తున్నారని కొందరు అంటున్నారు.
జగన్ ను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే… జరగబోయే పరిణమాలు ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్
మాజీ సీఎం జగన్‌ను జైలుకు పంపాలని పట్టుదలతో ఉన్నారని టాక్
అందుకే లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) దర్యాప్తు జగన్‌ను టార్గెట్ చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అటు జగన్ కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలకు చెక్ చెప్పేందుకు…
జనంలోకి వెళ్తున్నారు… ఒకవేళ అరెస్ట్ అయినా
జనంలో సానుభూతి ఉండాలనే వ్యూహంతో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ పొదిలి, పల్నాడు, గుంటూరు, బంగారుపాళెం లాంటి చోట్లకు వెళ్లారు.
రైతుల సమస్యలు, పార్టీ కార్యకర్తల కోసం జరిగిన ఈ పర్యటనల్లో జనం వెల్లువెత్తారు. దీంతో, కూటమి ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది.
జగన్ పర్యటనలను అడ్డుకోవడానికి పోలీసులను ఉపయోగించినా,
ఆయనకు జనాదరణ మరింత పెరిగింది. ఉ
దాహరణకు, బంగారుపాళెంలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం జరిగినా, ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఈ పర్యటనలతో జగన్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
“మేం తిరిగి అధికారంలోకి వస్తాం, అప్పుడు చూస్తాం” అంటూ చంద్రబాబు, ఆయన అనుచరులను హెచ్చరిస్తున్నారు.
ఇదంతా, అరెస్ట్ అయినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహ రాకుండా చేయడానికే అని పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ ధీమాగా “నేను తాడేపల్లిలోనే ఉన్నా, అరెస్ట్ చేసుకోండి” అని సవాల్ విసురుతున్నారు

లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరింది.
జగన్‌కు సన్నిహితుడైన మిథున్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఇప్పుడు జగన్‌ను కూడా త్వరలో అరెస్ట్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.
కానీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఈ అరెస్ట్ గురించి ఏమాత్రం భయం కనిపించడం లేదు. “మేం మళ్లీ అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుంటాం” అని హెచ్చరిస్తున్నారు.

జగన్ జనంలోకి వెళ్లకపోయి ఉంటే, వైసీపీకి చాలా నష్టం జరిగేది…
ప్రజల నాడిని పసిగట్టలేక, పార్టీ కార్యకర్తలు వీక్ అయ్యేవారేమో…
కానీ, జగన్ తెలివిగా వ్యవహరించి, జనం మధ్య ఉండటం ద్వారా
పార్టీలో… కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపారు. ఇ
టీవల జరిగిన సంఘటనల్లో, ఉదాహరణకు, తిరుమల గోశాల వివాదంలో కూడా జగన్ తన లీడర్లతో కలిసి జనం సమస్యలపై స్పందించారు.
ఇలాంటి చర్యలు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఒకవైపు, 2012లో జగన్‌ను సీబీఐ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసి,
16 నెలలు జైలులో ఉంచిన సంగతి మనకు తెలుసు.
అప్పట్లో కూడా ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి, 2019లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ జరిగితే,
జగన్ కి భారీగా సానుభూతి వస్తుంది…
మళ్లీ రాజకీయంగా బలపడే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ నమ్ముతోంది.

అందుకే జగన్ అరెస్ట్ అయినా, వైఎస్సార్‌సీపీ బలహీనం కాకుండా,
జనం మద్దతుతో మరింత బలపడే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీ మద్యం కేసు ఎటు మళ్ళుతుందో… జగన్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి!
Also read: బీహార్ లో 41 లక్షల ఓటర్లు మిస్సింగ్

Also read: కవిత ఇంటికి వాస్తు దోషం వల్లే సమస్యలు

Also read: రష్మికపై మరోసారి కన్నడిగుల ఫైర్

Also read: https://www.msn.com/en-in/news/India/andhra-liquor-scam-chargesheet-reveals-jagan-mohan-reddys-role-ysrcp-mp-midhun-reddy-arrested/ar-AA1IWz9N

Tagged

Leave a Reply