బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయం తాను చేసుకుంటూ పోతున్నారు. జనం ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా.. తన వెంట ఉన్న పిడికెడు మందితోనే పాలిటిలక్స్ చేస్తున్నారు. అన్న కేటీఆర్ తో గొడవపడినా, నా పార్టీ బీఆర్ఎస్, మా చీఫ్ కేసీఆర్.. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూనే ఉన్నారు. కానీ ఆమె రాజకీయాలు మాత్రం జాగృతి తరపున చేసుకుంటున్నారు. అందులో ఒక్క బీఆర్ఎస్ జెండా కనిపించడం లేదు. కవిత కూడా మెడలో వేసుకోవడం మానేశారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ… వచ్చే నెలలో రైల్ రోకోకు పిలుపునిచ్చారు. ఆ రైల్ రోకోను విజయవంతం చేయడం తన ఒక్కరి వల్ల సాధ్యం కాదు. అందుకే ఇతర పార్టీలను రంగంలోకి తేవాలని ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారు. బీసీ ఉద్యమ సంఘాలను కదిలించేందుకు ఆర్ కృష్ణయ్యతో చర్చలు జరిపారు. ఆయన మద్దతు ప్రకటించారు. బీసీ ఎజెండా కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇస్తానన్నారు. అయితే ఆయన గానీ, ఆయన అనుచరులు కానీ ఎవరూ పాల్గొనరు. కవిత కమ్యూనిస్టు పార్టీల నేతల్ని కూడా కలిసి మద్దతు కోరారు. ఏదైనా నిరసన, ఆందోళన చేపట్టాలంటే.. కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలైతేనే సీరియస్ నెస్ చూపిస్తారు. అందుకే వాళ్ళని కూడా కలుపుకుపోవాలని కవిత ప్లాన్ చేసుకున్నారు.
అన్నీ బాగున్నాయి కానీ మీ పార్టీ బీఆర్ఎస్ ఈ రైల్ రోకోలో పాల్గొంటుందా అంటే.. కవిత సమాధానం చెప్పలేకపోతున్నారు. పోనీ ఆహ్వానిస్తారా అంటే దానిపైనా ఎలాంటి సంకేతాలు లేవు. డాడీ కేసీఆర్ మాట్లాడటం లేదు. ఫామ్ హౌస్ కి వెళితే గేట్లు తెరుస్తారో లేదో కూడా తెలియదు. కేటీఆర్ కూడా కలవడం లేదు. హరీష్ రావుతో అస్సలు మాటల్లేవు. ఇలాంటి సందర్భంలో కవితకు బీఆర్ఎస్ సపోర్టు చేసే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పైగా ఆ పార్టీ లీడర్లు కూడా కవితతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. ఆ రైల్ రోడ్ తర్వాత బీఆర్ఎస్, కవిత మధ్య అంతరం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
Also read: ‘వార్ 2’ కౌంట్ డౌన్ స్టార్ట్ : ఎన్టీఆర్
Also read: ఫైటర్ గా రష్మిక మందన్నా
Also read: జాడ లేని ఇరాన్ సుప్రీం లీడర్
Also read: https://telanganatoday.com/left-parties-back-kavithas-july-17-rail-roko-for-42-bc-quota