ఒక మస్తాన్ సాయి… ఒక బత్తుల ప్రభాకర్… ఒక దేవ నాయక్… ఒక మంజు… గత కొన్ని రోజులుగా మీడియాలో… పత్రికల్లో వినిపిస్తున్న పేర్లు ఇవి. మద పిచ్చితో చెలరేగిపోతున్నారు వీళ్ళు… పెళ్ళి చేసుకుంటామని… సినిమాల్లో… యూట్యూబ్స్ లో… సీరియల్స్ లో, టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయకపు అమ్మాయిలకు వల వేస్తున్నారు. ఒకడు 100 మంది… మరొకడు 300 మంది… ఇలా టార్గెట్ పెట్టుకొని అమ్మాయిలకు ఎరవేస్తున్నారు. లోకం పోకడ తెలియని అమాయకులు ఇలాంటి వాళ్ళకు చిక్కుతున్నారు. అమ్మాయిలూ… బీకేర్ ఫుల్…
గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ న్యూస్ వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఒకడు భార్యను చంపి… ముక్కలు చేసి… ఇంకా ఏదో ఏదో… అది రాయాలన్నా… మనస్సు ఒప్పుకోవట్లేదుడం లేదు. ఇది కాకుండా… ఇక అమ్మాయిలను… కాలేజీలకు వెళ్ళే విద్యార్థులను టార్గెట్ చేసుకొని చెలరేగిపోతున్నారు మరికొందరు కామాంధులు. సమాజం అంటే భయం లేదు… చట్టాలు అంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ లో, టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమ్మాయిలను నమ్మించి… పార్టీల పేరుతో ఆహ్వానించి డ్రగ్స్ కు బానిసలు చేస్తున్నారు. ఆ డ్రగ్స్ మత్తులో వాళ్ళని పాడు చేసి… ఆ వీడియోలను ఇంటర్నేషనల్ పోర్న్ సైట్స్ లో పెట్టి … అమ్ముకుంటున్నారు. మస్తాన్ సాయి అనే వాడు ఏకంగా 300 మంది అమ్మాయిలపై దారుణాలకు ఒడిగట్టాడు. బత్తుల ప్రభాకర్ అనేవాడు వంద మందిని టార్గెట్ చేసుకున్నాడట. పాలు తాగే పసిపాపల నుంచి వృద్ధుల దాకా ఎవర్నీ వదిలిపెట్టడం లేదు ఈ మృగాళ్ళు.
ఇది కూడా చదవండి :పెళ్లి సంబంధాల పేరుతో న్యూడ్ కాల్స్ ! ? బీకేర్ ఫుల్ !!
అమ్మాయిలూ బీకేర్ ఫుల్
అమ్మాయిలు సోషల్ మీడియా మత్తులో పడి ఇలాంటి కామోన్మాదుల వలలో చిక్కుకోవద్దు. అపరిచితులతో ఫ్రెండ్షిప్ పెట్టుకోకండి. అసలు మీ పర్సనల్ విషయాలేవీ ఇతరులకు షేర్ చేయొద్దు. మీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టకండి…. అమ్మాయిల జీవితాలను నాశనం చేయడమే లక్ష్యంగా సమాజంలో తిరుగుతున్న ఈ మృగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. మృగాడి హంగూ, అర్భాటాలు చూసి మోసపోకండి… ఫ్రెండ్షిప్ అంటూ… పెళ్ళి చేసుకుంటామని వాళ్ళు చెప్పే మాయమాటలు విన్నారో… మీరు జీవితంలో సర్వం కోల్పోతారు. పార్టీలు, పబ్బుల కల్చర్ లో తిరిగితేనే జీవితం అని అనుకోవద్దు. అలాంటి మీ వీక్నెస్ ని అడ్డం పెట్టుకునే చెలరేగిపోతున్నారు ఈ కామాంధులు. వీళ్ళు అరెస్ట్ అయినా… ఏదో రకంగా బెయిల్ తెచ్చుకొని మళ్ళీ సమాజంలో తిరుగుతున్నారు. మళ్ళీ అదే పనులు చేస్తున్నారు. వీళ్ళని శిక్షించడానికి నిజంగా కొన్ని దేశాల్లో అమల్లో ఉన్నట్టుగా చేతులు, కాళ్ళు నరికే చట్టాలను మన దేశం కూడా అడాప్ట్ చేసుకోవాలేమో.
ఇది కూడా చదవండి : Cancer Risk: క్యాన్సర్ కి ఇవే కారణం: అర్జెంట్ గా అవతల పారేయండి !
Our Family is our Strength
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్… మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి… అమ్మా, నాన్న, తోబుట్టువుల కంటే మనకి ఈ వెధవలు ఎక్కువ కాదు… మన ఫ్యామిలీయే మనకు సంతోషం. ఎప్పుడైనా మీ అమ్మ, నాన్న కోప్పడినా… పెద్దగా పట్టించుకోకండి… నిజంగా మన సంతోషాన్ని కోరుకునేది కూడా వాళ్ళే…
మీకు ఏదైనా సాయం కావాల్సి వస్తే Women Help line నంబర్ 181 కాల్ చేయండి. వెబ్ సైట్ LINK
(విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్)
మంచి ఆర్టికల్స్ అందిస్తున్న తెలుగు వర్డ్ Telegram Group లో జాయిన్ అవ్వండి.
Please comment your opinions & Join our Telugu Word Telegram Group with this Link
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Affiliate Recommendation :
మీ కారు ఇన్సూరెన్స్ చాలా ఈజీ : Click here for Car Insurance