పెళ్లి సంబంధాల పేరుతో న్యూడ్ కాల్స్ ! ? బీకేర్ ఫుల్ !!

Cyber Alerts Latest Posts Top Stories Trending Now

గతంలో పెళ్ళి అంటే… అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాల్లో.. కుటుంబాలు మంచివా… కాదా అని చెక్ చేసుకొని సంబంధాలు కుదుర్చుకునేవారు. కానీ ఇప్పుడు మ్యాట్రిమోనీ యాప్స్ లో, పోర్టల్స్ లో ప్రొఫైల్స్ చూసి మ్యాచెస్ కుదుర్చుకుంటున్నారు. అయితే వీటిల్లో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ కూడా ఉండొచ్చు. పెళ్ళి చేసుకునే సంబరంలో ఉన్న పెళ్ళి కొడుకు లేదంటే పెళ్ళి కూతురుని దారుణంగా మోసం చేస్తున్నారు కేటుగాళ్ళు. అదేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Marriage

మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్, యాప్స్ లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ మోసాలు, దోపిడీలకు తెగబడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్ళు. యాప్స్ లో అందమైన అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలతో… ప్రొఫైల్స్ కూడా ఆకట్టుకునేలాగా తయారు చేసి పెడుతున్నారు. వీటికి అట్రాక్ట్ అయిన అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఆ ఫేక్ ప్రొఫైల్స్ లో ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. అలా కాంట్రాక్ట్ లోకి రాగానే… పరిచయాలు పెంచుకునే సాకుతో… వీడియో కాల్స్ చేస్తున్నారు ఆ ఫేక్ ప్రొఫైల్స్ కేటుగాళ్ళు… అబ్బాయిలకైతే అమ్మాయిలతో… అమ్మాయిలకు అబ్బాయిలతో… న్యూడ్ కాల్స్ చేయిస్తున్నారు. దాన్ని రికార్డు చేసి… బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా ఈమధ్య కాలంలో చాలా సంఘటలు వెలుగులోకి వస్తున్నాయి. అలా రికార్డు చేసిన వీడియోలు పబ్లిక్ గా లీక్ చేస్తామంటూ… బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు గుంజుతున్నారు. పెళ్ళి సంబంధాలు చూస్తున్న టైమ్ లో … ఇలాంటి వీడియోలు బయటకు వెళితే తమ పరువు పోతుందని… సంబంధాలు వెతుకుతున్న అబ్బాయిలు, అమ్మాయిల తల్లిదండ్రులు… ఆ సైబర్ నేరగాళ్ళ బెదిరింపులకు తలొగ్గి… అడిగినన్ని డబ్బులు ఇచ్చుకుంటూ బయటపడుతున్నారు. ఇలాంటి సంఘటనపై ఓ యువతి షేర్ చేసిన వీడియోను TGSRTC ఎండీ, IPS అధికారి సజ్జనార్ నెటిజన్లతో పంచుకున్నారు. మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ లో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఆరోగ్యానికి చుక్క కూర బెస్ట్

జాగ్రత్త… తొందరపడి వీడియో కాల్స్ చేయొద్దు

Marriage

మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో ప్రొఫైల్స్ అసలైనవేనా… నకిలీవా … అన్నది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి. ఆ ప్రొఫైల్ తాలూకూ తల్లిదండ్రులు, బంధువులతో ముందుగా ఫోన్ లో లేదంటే స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో మీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా అబ్బాయి లేదా అమ్మాయిలు ప్రొసీడ్ అవ్వొద్దు. వీడియో కాల్స్ లో మాట్లాడాలి అని అవతలి వ్యక్తి అడిగితే వెంటనే ఒప్పుకోవద్దు. న్యూడ్ ఫోటోలు అడిగినా… కొంచెం తేడాగా మాట్లాడుతున్నా… వెంటనే అనుమానించాల్సిందే. తప్పనిసరిగా వీడియో కాల్స్ లో మాట్లాడాల్సి వస్తే… వెంటనే మీ వీడియోను ఆన్ చేయొద్దు. ఎవరైనా మోసపోతే… ధైర్యంగా 1930 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సాధ్యమైనంతగా మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ జోలికి పోకుండా ఉంటేనే బెటర్ అని పెద్దలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : iPhoneలో బుక్ చేస్తే అధిక ధరలా ?

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Tagged