93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్

Latest Posts Trending Now

* వాళ్ళ బాండింగ్ కి షాపు యజమాని ఫిదా
‘ రూ.20 లకే మంగళసూత్రం ఇచ్చేసిన ఓనర్
ముంబై : 93 ఏళ్ల వృద్ధుడు తన భార్యకు మంగళసూత్రం కొనడానికి బంగారం షాపుకు వెళ్లాడు. ఈ వయసులోనూ వీళ్ల బాండింగ్ చూసి బంగారం షాపు యజమానికి ముచ్చటపడి గోల్డ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రేమకు వయసు, పేదరికంతో సంబంధం లేదు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌ లో.. తెల్లని ధోతి, కుర్తా, టోపీ ధరించిన నివృత్తి షిండే అనే 93ఏళ్ల వృద్ధుడు ఓ బంగారం దుకాణంలోకి తన భార్యశాంతాబాయితో వచ్చాడు. వీళ్లని షాపు వాళ్లు మొదట చూసినపుడు డబ్బులు అడగడానికి వస్తున్నారేమో అని అనుకున్నారు. అయితే ఆ వృద్ధుడు తన భార్యకు మంగళసూత్రం కొనడానికి వచ్చానని చెప్పి.. తమ వద్దనున్న రూ.

1120 లను షాపు ఓనర్ కు ఇచ్చారు. దీంతో షాపు యజమాని వారి మధ్య ఉన్న బాండింగ్ కు ఫిదా అయిపోయాడు. ఈ వయసులో భార్య కోసం ఆ పెద్దాయన చూపిస్తున్న ప్రేమ చూసి ఎమోషనల్ అయ్యాడు. వారి వద్ద నుంచి కేవలం రూ.20 తీసుకుని మంగళసూత్రాన్ని వాళ్లకి బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ వృద్దజంట సంబరపడిపోయారు. నిజమైన ప్రేమ డబ్బును, పేదరికాన్ని దాటి ఉంటుందని ఈ జంట నిరూపించింది. భార్యా భర్తల మధ్య అర్థం చేసుకునేంత ప్రేమ ఉంటే.. కలకాలం ప్రశాంతంగా, సంతోషంగా గడపవచ్చని ఈ జంట.. ప్రస్తుత సమాజానికి ఒక సందేశం ఇస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో 2 కోట్లకు పైగా వ్యూస్‌తో వైరల్ అవుతోంది.

Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!

Also read: జనసేనలో అసంతృప్తి జ్వాలలు!

Also read: ఆధార్ అప్‌డేట్ మరో ఏడాది ఫ్రీ!

Also read: https://www.indiatvnews.com/maharashtra/heartwarming-93-year-old-gifts-wife-mangalsutra-jeweller-accepts-just-rs-20-instead-of-full-price-video-2025-06-18-995119

Tagged

Leave a Reply