ముంబై: ఆట్ ఫ్రీధార్ కార్డ్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా ఆధార్ ఆధారంగానే మనకు గుర్తింపు ఇస్తున్నాయి. ఈ ఆధార్ ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
UIDAI అంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎప్పటికప్పుడు ఆధార్ అప్ డేట్ కోసం అవకాశాలు కల్పిస్తోంది. ఆధార్ లో అడ్రెస్, పేరు తప్పుపడినా, మొబైల్ నెంబర్, ఫోటో లాంటివి మార్పులు చేర్పులు చేసుకోడానికి ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించింది. గతంలో దీనికి ఈనెల 14న గడువు తేదీగా నిర్ణయించారు. ఇప్పుడు దానిని మళ్ళీ పొడిగించారు.
దాంతో ఆధార్ లో మార్పులు, చేర్పులను మరో ఏడాది పాటు ఉచితంగా చేసుకోవచ్చు. అందే జూన్ 14, 2026 వరకు ఫ్రీ అప్‌డేట్ సౌకర్యాన్ని ఉడాయ్ కల్పించింది. ఆధార్ ను పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ని విజిట్ చేసి అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళి చేయించుకునే వారి నుంచి ఫీజు వసూలు చేస్తారు. ఆన్ లైన్ పోర్టల్‌లో మాత్రం ఉచితంగానే చేసుకునే అవకాశం వచ్చింది.
Also read: వాట్సాప్‌లో కొత్త యాడ్స్ ఫీచర్!
Also read: వాట్సాప్‌లో కొత్త యాడ్స్ ఫీచర్!
Also read: కుబేర బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి!
Also read: https://myaadhaar.uidai.gov.in/