ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సంచలన మార్పులు వస్తున్నాయి. ఇప్పటిదాకా యాడ్స్ లేకుండా, ఫ్రీగా సర్వీస్ ఇచ్చిన వాట్సాప్, ఇప్పుడు ఆదాయం కోసం అప్‌డేట్స్ ట్యాబ్‌లో యాడ్స్ తీసుకొస్తోంది.
వాట్సాప్‌లో యాడ్స్ ఎందుకు?
వాట్సాప్ అంటే ఎవరికీ యాడ్స్ లేకుండా, సింపుల్‌గా చాట్ చేసుకునే యాప్‌గా తెలుసు. కానీ, ఇప్పుడు మెటా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొదటిసారి వాట్సాప్‌లో యాడ్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాడ్స్ అప్‌డేట్స్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. అంటే, స్టేటస్, ఛానెల్స్ ఉండే ఆ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు చూడొచ్చు. వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో చెప్పినట్లు, దాదాపు 1.5 బిలియన్ మంది రోజూ ఈ అప్‌డేట్స్ ట్యాబ్‌ని చూస్తారట. అందుకే వ్యాపారాలు, ఛానెల్ అడ్మిన్లు, ఆర్గనైజేషన్లు ఈ యాడ్స్ ద్వారా ఎక్కువ మందిని చేరుకోవచ్చని వాట్సాప్ భావిస్తోంది.
యాడ్స్ ఎలా ఉంటాయి?
ఈ యాడ్స్ మూడు రకాలుగా వస్తాయి:
ఛానెల్ సబ్‌స్క్రిప్షన్: మీకు ఇష్టమైన వాట్సాప్ ఛానెల్‌కి నెలకు కొంచెం ఫీజు చెల్లించి సపోర్ట్ చేయొచ్చు. దాంతో ఆ ఛానెల్ నుంచి ఎక్స్‌క్లూసివ్ అప్‌డేట్స్ పొందొచ్చు.
ప్రమోటెడ్ ఛానెల్స్: ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నవి కనిపిస్తున్నాయి. ఇకపై అడ్మిన్లు కొంచెం ఫీజు చెల్లించి తమ ఛానెల్‌ని ప్రమోట్ చేసి, ఎక్కువ మందికి చూపించొచ్చు.
స్టేటస్‌లో యాడ్స్: ఇప్పటిదాకా స్టేటస్‌లో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టేటస్‌లే కనిపిస్తున్నాయి. ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్‌లు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, షాపింగ్ ఆఫర్స్ లేదా కొత్త ప్రొడక్ట్స్ గురించి స్టేటస్‌లు వచ్చొచ్చు.
పర్సనల్ చాట్స్ యాడ్-ఫ్రీనే!
యూజర్లకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే… ఈ యాడ్స్ కేవలం అప్‌డేట్స్ ట్యాబ్‌లోనే కనిపిస్తాయి. మీ పర్సనల్ చాట్స్, గ్రూప్ చాట్స్ ఎప్పటిలాగే యాడ్-ఫ్రీగానే ఉంటాయి. అంతే కాదు, మీ కాల్స్, మెసేజులు, స్టేటస్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయని వాట్సాప్ తెలిపింది. యాడ్స్ కోసం మీ దేశం, సిటీ, భాష లాంటి సింపుల్ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటామని, మీ ఫోన్ నంబర్‌ని ఎవరితోనూ షేర్ చేయబోమని వాట్సాప్ అంటోంది. కానీ, ఈ యాడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయన్నది మాత్రం ఇంకా చెప్పలేదు.]
Also read: కాంతార – శాపగ్రస్త సినిమా?
Also read: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్: పాకిస్తాన్!
Also read:కుబేర బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి!
Also read: https://www.whatsapp.com/