మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాలో కథానాయికగా నయనతార ఖరారైంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు ప్రచారంలో ఉండగా, తాజాగా టీమ్ అధికారికంగా ఆమెను అనౌన్స్ చేస్తూ ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. వీడియోలో నయన్ స్టైల్‌లో “హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా” అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
చిరంజీవి సైతం ఈ అనౌన్స్‌మెంట్‌ను స్వాగతిస్తూ, “హ్యాట్రిక్ మూవీలో నయనతారతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ తర్వాత ఈ జంటకు ఇది మూడవ చిత్రం. ఇందులో చిరంజీవి తన అసలు పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మరో కథానాయికగా అదితి రావు హైదరీను సంప్రదించారన్న సమాచారం ఉంది.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో చిరు మరో చిత్రం ‘విశ్వంభర’ పూర్తి చేస్తుండగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో కొత్త ప్రాజెక్ట్ కూడా ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Read This Also : ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ ప్రెస్ మీట్ తేది ఫిక్స్..!
Read This Also : ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. ‘వార్ 2’ నుంచి హృతిక్ గిఫ్ట్
Read This Also : దేశం కంటే ముందు ఆ పనిచేయండి: రేణు దేశాయ్ సంచలన కామెంట్స్