హైదరాబాద్: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ పై సినిమా అభిమానుల్లో ఆసక్తి నిత్యం పెరుగుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ప్రత్యేక సర్‌ప్రైజ్ అందించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు.
‘‘ఆ సర్‌ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నా… కబీర్, నిన్ను వెతికి పట్టుకుని ఓ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నా,’’ అంటూ ట్విటర్ వేదికగా సరదాగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ‘వార్ 2’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల కానుందని చిత్ర పరిశ్రమలో ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే చిత్రబృందం ‘వార్ 2’ను 2025 ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో విడుదలైన ‘వార్’ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు హీరోలుగా కనిపించి స్పై థ్రిల్లర్‌గా ఘన విజయం సాధించింది.
అదే విజయం కొనసాగించేందుకు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘వార్ 2’. ఇందులో ఎన్టీఆర్ ఓ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
Read This Also :దేశం కంటే ముందు ఆ పనిచేయండి: రేణు దేశాయ్ సంచలన కామెంట్స్
Read This Also :లాక్ చేసిన ‘కింగ్ డమ్’ యూనిట్… సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫోటో విడుదల
Read This Also : జైలర్-2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?