రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ డమ్’ రిలీజ్ వాయిదా పడింది. మునుపు మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 4న థియేటర్లకు రానుంది. అయితే సినిమాపై హైప్ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్‌తో అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా ఓ కీలక అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సినిమా ఫైనల్‌గా లాక్ చేశామంటూ తెలియజేశాడు.
అదే సందర్భంలో సెట్స్‌లో దిగిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు. అందులో డైరెక్టర్ ఆయనకు సీన్ వివరించడమే కాక, విజయ్ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. “ఇన్ని రోజులు విజయ్ ఎలా కనిపిస్తాడో అని ఎదురు చూసినవాళ్లకు ఇది సర్ప్రైజ్ లా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి జూన్ నెల నుంచి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసే అవకాశముంది. విజయ్ మాత్రం ఈ సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.
Read This Also : జైలర్-2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?
Read This Also : “ఆర్ఆర్ఆర్ 2 వస్తుందా?” రాజమౌళి సమాధానం ఏమిటి?
Read This Also : సరస్వతీ పుష్కరాల మహిమ తెలుసుకోండి!