PAN 2.0: పాన్‌ కార్డ్‌ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?

Blog Credit Cards Insurance Money Matters Personal Finance Trending Now

PAN 2.0: పాన్ కార్డులను మోడర్నైజేషన్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. PAN 2.O ప్రాజెక్ట్‌కు ఒకే చెబుతూ రూ.1435 కోట్లు కేటాయించింది. Income Tax payersకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. అంటే ఇకపై కొత్త PAN కార్డులు QR Codeతో మంజూరు చేస్తారు. ప్రభుత్వం PAN 2.O ప్రకటించగానే చాలామందిలో డౌట్స్ మొదలయ్యాయి.   ఆ డౌట్స్ ని Income tax dept ద్వారా క్లారిఫై ప్రయత్నం చేస్తోంది  Telugu Word.

ఇలాంటి మంచి మంచి కథనాలు అందిస్తున్న Telugu word website Telegram groupలో జాయిన్ అవ్వండి.

Click here : Telugu Word Telegram Link

PAN 2.0

పాత PAN CARDS సంగతి ఏంటి ?

అవి చెల్లుబాటు అవుతాయా ?

వాటిని ఎక్కడైనా submit చేసి కొత్తవి తీసుకోవాలా ?

పాత కార్డులు ఉన్నవారు మళ్ళీ అప్లయ్ చేయాలా ?

కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చా ?

లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ confusion కు Income tax dept అధికారులు జవాబులు ఇచ్చారు.

కొత్త పాన్ కార్డు తీసుకోవాలా ?

ప్రస్తుతం PAN కార్డులు కలిగి ఉన్నవారు మళ్ళీ కొత్తగా అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. పాన్‌ 2.0 వచ్చినా పాత కార్డులు కొనసాగుతాయి. నంబర్లు కూడా అవే ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. పాత కార్డులు అన్నీ చెల్లుబాటు అవుతాయి.

కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చా ?

పాత పాన్‌ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉన్నా లేదంటే మార్పులు, చేర్పులు చేసుకోడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌, పుట్టిన తేదీ, పేరులో సవరణలు చేసుకోడానికి ఛాన్సుంది. పాన్‌ 2.0 తర్వాత కూడా ఉచితంగానే ఈ అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతానికి ఆధార్‌ సాయంతో ఆయా వివరాలను NSDL, UTISL వెబ్‌సైట్ల ద్వారా చేసుకోవచ్చని ఐటీ శాఖ తెలిపింది.

PAN CARD

QR Code ఏంటి ?

PAN 2.0 ప్రాజెక్ట్‌లో పాన్‌ కార్డులు QR Codeతో వస్తాయి. అయితే ఇది కొత్త విధానం కాదు అంటున్నారు Income Tax అధికారులు. 2017-18 నుంచి జారీ చేస్తున్న అన్ని PAN CARDS మీద QR Code ఉంటోంది. అదే 2.0లోనూ కొనసాగుతుంది. QR Code స్కాన్‌ చేస్తే… PAN DATAలో ఉన్న వివరాలన్నీ కనిపిస్తోంది. QR Codeలేని పాన్‌ కార్డు దారులు ఇప్పుడు కొత్తగా QR Codeతో వచ్చే కార్డుల కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

ఇ-పాన్ ఉచితమే

QR Code తో వచ్చే పాన్ కార్డుల కోసం తప్పనిసరిగా అప్లయ్ చేసుకోనక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత PAN Cards అన్నీ చెల్లుబాటు అవుతాయి. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులను updateచేశాక… వినియోగదారుల మెయిల్ కు E-PAN వస్తుంది. ఇందులో ఛార్జీలేవీ వసూలు చేయరు. QR Code తో ఉన్న కొత్త పాన్ కార్డు Physical గా కావాలి అంటే మాత్రం… దేశంలో అయితే Rs. 50, International delivery అయితే Rs.15+ Postal ఛార్జీలు చెల్లించాలి. ప్రస్తుత పాన్ కార్డులో పేరు, అడ్రెస్ లాంటి వివరాలు మార్చుకోవాలి అంటే… PAN 2.O యాక్టివేట్ అయ్యాక ఉచితంగా అప్లయ్ చేసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది.

Read also : Digital Loans : యాప్ లోన్ కావాలా? జాగ్రత్త… దెబ్బయిపోతారు !

 

ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Click here : Telugu Word Telegram Link

Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *