గతంలో ఏదైనా డబ్బులు అవసరమైతే… ఫ్రెండ్ ని అప్పు అడిగేవాళ్ళం. మరీ ఎక్కువ మొత్తం కావాలనుకుంటే మూడు లేదా నాలుగు రూపాయలకి తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకునే వాళ్ళం. ఇంకా అవసరమైతే బ్యాంకుల్లో పర్సనల్ లోన్. కానీ ఇప్పుడు ఆ సిస్టమే మారిపోయింది. యాప్ ఓపెన్ చేసి… వివరాలు ఎంటర్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే మన బ్యాంక్ అకౌంట్ లోకి లోన్ డబ్బులు పడిపోతున్నాయి. మనకు అవసరం ఉన్నా లేకున్నా… మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ చేస్తూ …లోన్ కావాలా బాబూ అని అడిగే సంస్థలు ఎన్నో ఉన్నాయి. మీరు అవసరానికి అప్పుతీసుకుంటున్నారా ? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే రుణ యాప్ లో మాయలో పడితే దెబ్బయిపోతారు.
కోవిడ్ వచ్చి వెళ్లాక… చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక అవసరాలు పెరిగిపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో… Loans ఇచ్చే app లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. 3 వేల నుంచి 10 లక్షల దాకా రుణాలిస్తున్నాయి ఈ యాప్స్. రోజుకి నాలుగైదు మెస్సేజ్ లు పంపుతూ కస్టమర్ ని తమ ఉచ్చులోకి లాక్కుంటున్నాయి. కానీ లోన్లు ఇచ్చే యాప్స్ చాలా మటుకు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని చైనా Loan apps అయితే… వడ్డీల మీద వడ్డీలు వేస్తూ… టైమ్ కి కట్టకపోతే ఫ్రెండ్స్, బంధువులకు మెస్సేజ్ లు పంపుతూ పరువు తీస్తున్నాయి. ఆ మధ్యకాలంలో చాలా మంది ఈ Fake లోన్ యాప్స్ నిర్వాహకులు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కానీ ఈమధ్య కొంచెం awareness పెరగడంతో… లోన్ యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు. మీరు digital loan తీసుకుంటుంటే మాత్రం కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
ఆ యాప్ కి గుర్తింపు ఉందా?
దేశంలో అప్పులు ఇచ్చే ఏ సంస్థ అయినా… అది చిన్నదైనా, పెద్దదైనా… Reserve Bank of India (RBI) గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థతో కలిసి పనిచేస్తుండాలి. RBI నిబంధనల ప్రకారం గుర్తింపు లేని సంస్థలు అప్పులు ఇవ్వడానికి వీల్లేదు. మీరు Digital loans తీసుకోవాలనుకుంటే ముందుగా ఆ సంస్థ… లేదా appకి RBI గుర్తింపు ఉందా లేదా చెక్ చేసుకోండి. వాటి గుర్తింపు సంఖ్య లాంటి Reserve Bank website లో దొరుకుతాయి. మనం Loan తీసుకునేటప్పుడు… ఆ సంస్థలు మన దగ్గర KYC తీసుకుంటాయి. అలాగే మనం కూడా ఆ సంస్థ బాగోగులు తెలుసుకోవాలి. ఆ తర్వాతే లోన్ తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
మెస్సేజ్ ల మాయలో పడొద్దు !
మీ క్రెడిట్ స్కోరుతో పనిలేదు… మీరు సంపాదించినా… సంపాదించకున్నా… మేం లోన్ ఇస్తామంటూ కొందరు… ఇంకా కొన్ని యాప్స్ అయితే మీకు 10 లక్షలు లోన్ శాంక్షన్ అయింది… EMI ఇంత కట్టండి… మీరు ఓకే అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మొబైల్ కి messages పంపుతుంటాయి. అలాంటి messageలు అస్సలు నమ్మొద్దు. మీ personal data, address, aadhar, bank accounts information తీసుకోడానికి ఎత్తుగడ వేస్తున్నాయని గమనించండి. అందుకే వచ్చిన ప్రతి మెస్సేజ్ కి స్పందించి మీ డిటైల్స్ అందులో ఎంటర్ చేయొద్దు. లోన్ సంగతి ఏమో గానీ… మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పదో… పరకో కూడా లాగేసుంటారు సైబర్ క్రిమినల్స్.
అగ్రిమెంట్ చదువుకోండి
చాలామంది digital loans తీసుకునేటప్పుడు … అగ్రిమెంట్స్ చూడకుండానే టిక్ చేసి submit చేస్తుంటారు. కానీ RBI నిబంధనల ప్రకారం లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ లేదా ఆ ఫైనాన్స్ సంస్థ తప్పనిసరిగా తమ బ్యాంక్ రూల్స్ లోన్ తీసుకునే వాళ్ళకి తెలియజేయాలి. కానీ కొన్ని సంస్థలు అవేమీ చూపించకుండా లోన్ ఇస్తుంటాయి. ఇలా అగ్రిమెంట్ లేకుండా డబ్బులు ఇస్తున్నాయంటే… రేపు మీ నుంచి అధిక వడ్డీ వసూలు చేయడం… EMIలను తమ ఇష్టమొచ్చినట్టు వసూలు చేసుకునే అవకాశం ఉందని గ్రహించండి. అలాంటి యాప్స్ చాలా డేంజర్ అని తెలుసుకోండి. అందుకే మీరు లోన్ తీసుకునేముందు తప్పనిసరిగా అగ్రిమెంట్ ని చూపించమని అడగండి. అందులో మీ దగ్గర వసూలు చేసే అన్ని ఛార్జీలను తప్పనిసరిగా mention చేస్తాయి. అంతే కాదు… ఈ రూల్స్ అన్నీ ఆ సంస్థల websites లో కూడా ఇచ్చారో లేదో పరిశీలించండి. అవన్నీ చూసిన తర్వాతే loan విషయంలో ముందుకు వెళ్ళాలి.
లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు
👉 Digital Loans ఇచ్చే సంస్థల అడ్రస్సులు, ఏ బ్యాంకు లేదంటే NBFCతో ఒప్పందం చేసుకున్నాయో తెలుసుకోవాలి.
👉 ఒక్కోసారి Bankల పేరు చెప్పి… మీకు లోన్ ఇస్తామంటూ… Bank Account Number, Credit, Debit Card numbers లాంటి వివరాలు అడుగుతారు. అలాగే కార్డుల expiry date, pin, OTPలు చెప్పాలని కోరుతుంటారు. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు.
👉 యాప్స్ ద్వారా Digital Loans ఇస్తున్నా… వాటికి కూడా ఓ Website, Address లాంటివి తప్పనిసరిగా ఉండాలి… లేదంటే Fake అనీ… చైనా సంస్థే అని గ్రహించండి.
👉 RBI నిబంధనలతో రుణం ఇచ్చే సంస్థ ‘మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (KYC) రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. అలా అడగటం లేదంటే అది ఫేక్ సంస్థ అని గుర్తుంచుకోండి.
👉 మంచి Cibil Score ఉంటేనే బ్యాంకులు loans ఇస్తుంటాయి. కానీ మీ Credit score అక్కర్లేదు… వెంటనే loan శాంక్షన్ చేస్తామంటే అనుమానించాల్సిందే. అలాగే నాకు అప్పు వద్దురా… నాయనా అని మొత్తుకుంటున్నా…. పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తున్నా అవి ఫేక్ సంస్థలే అని గ్రహించండి.
👉 మీకు Loan sanction కాకుండానే processing fees కింద కొంత అమౌంట్ చెల్లించాలని అడిగినా అది Fake సంస్థ అని గుర్తించండి. జనరల్ గా Banks, NBFCలు మనకు లోన్ ఇచ్చిన అమౌంట్ లోనే కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ను బ్యాంకుల్లో వేస్తాయి.
👉తొందర పడి యాప్స్ లో లోన్లు తీసుకొని ఇబ్బందులు పడకండి… మోసపోయామని గ్రహిస్తే 1930 నెంబర్ ద్వారా సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కి గానీ. లేదా మీకు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో గానీ ఫిర్యాదు చేయండి.