అతినిద్ర కూడా అనర్థమే! 7-9 గంటల నిద్రతో ఆరోగ్యం

Healthy Life Latest Posts

ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి లేనిపోని రోగాలకు కారణమవుతోంది. కానీ అతిగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ‘స్లీప్ హెల్త్ ఫౌండేషన్’ 21 లక్షల మంది హెల్త్ ట్రాక్ డేటాను విశ్లేషించి, నిద్ర, ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో అకాల మరణ ప్రమాదం 14 శాతం ఎక్కువగా ఉందని, అదే తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వారిలో ఈ ప్రమాదం 34 శాతం ఉందని స్టడీ తెలిపింది. అతినిద్ర మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపడమే కాక, నిరాశ, బరువు పెరగడం, గుండె జబ్బులు, మధుమేహం, హార్ట్ స్ట్రోక్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అతినిద్ర శరీరంలో ఇప్పటికే ఉన్న అంతర్గత ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్టడీ ప్రకారం, రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర ఆరోగ్యానికి ఉత్తమం. దీనికి మించి లేదా తక్కువ నిద్రపోతే శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. స్లీప్ అప్నియా, మందుల దుష్ప్రభావాలు, నిద్రలో అంతరాయాలు కూడా అతినిద్రకు కారణమవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిద్ర సమయాన్ని నియంత్రించాలని, హెల్త్ ట్రాకర్లు లేదా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించి నిద్రను ట్రాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అందువల్ల నిద్రను సమతుల్యంగా ఉంచుకోండి!

7-9 గంటల నాణ్యమైన నిద్రతో ఆరోగ్యంగా, సంతోషంగా జీవించండి!

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Read also : TOP 6 MOBILES UNDER 20K – AMAZON FREEDOM SALE

Read also : రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

Read also : రాజాసింగ్ ఎన్‌కౌంటర్ కి స్కెచ్ !

Tagged

Leave a Reply