ప్రజలకు సేవ చేయాలి… ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి… అనే ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రావడమే కాదు… దాన్ని నూటికి నూరుపాళ్ళు ఆచరించి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డ్యూటీ ఫస్ట్… ఫ్యామిలీ నెక్ట్స్ అని మరోసారి నిరూపించారు జనసేనాని.
పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ …మంగళవారం నాడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కి ఈ విషయం తెలిసింది. పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, జనసేన నాయకులు సూచించారు. కానీ తాను అరకు దగ్గర్లోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చా… అందువల్ల ఆ గ్రామం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు… అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసే వెళ్తానని తెలిపారు. అన్నట్టుగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధికారిక పర్యటనలు అన్నీ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చి మంగళవారం రాత్రి తన అన్న చిరంజీవి, వదినతో కలసి సింగపూర్ కి వెళ్ళారు. దీన్నిబట్టి ప్రజలు అంటే పవన్ కల్యాణ్ కి ఎంత మమకారమో అర్థమవుతుంది.
హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు విని ఆయన అభిమానులు, జనసైనికులు ఆశ్చర్యపోతున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తాను ఇంకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదని అన్న పవన్ మాటలను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డెడికేషన్ తో పనిచేస్తున్న పవన్ కు హ్యాట్సాప్ చెబుతున్నారు. అరకు ప్రాంతంలో కూటమి ప్రభుత్వం గెలవకపోయినా… అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్న మాటకు కట్టుబడి ఆ ప్రాంతంలో పర్యటనకు పవన్ వెళ్ళారని జనసేన నేతలు చెప్పారు. 2018లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అరకు ప్రాంతాన్ని పవన్ సందర్శించారని అన్నారు. రాజకీయాల్లో పవన్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అంటున్నారు జనసైనికులు.
పవన్ కి నేషనల్ మీడియా కితాబు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు నేషనల్ మీడియాకు కూడా హ్యాట్సాప్ చెప్పింది. టైమ్స్ నౌ టీవీ దీనిపై ప్రత్యేక వార్తను ప్రసారం చేసింది. డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్ట్స్ అని పవన్ భావించడాన్ని పొగడ్తలతో ముంచెత్తింది. దేశంలోనే అత్యంత నిజాయతీ పరుడు, జవాబుదారీ తనం కలిగిన రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ అంటూ కితాబిచ్చింది టైమ్స్ నౌ. కురడి గ్రామానికి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాననీ, ఆ గ్రామంలో ఉండే గిరిజనులను కలవకుండా వెళ్ళేది లేదని చెప్పడాన్ని ఆ టీవీ ఛానెల్ ప్రశంసించింది.
Read also : రాత్రిళ్ళు చపాతీలు తింటున్నారా? కాస్త ఆగండి !
Read also : ఎండలో కారు నడుపుతున్నారా? Be Careful!