పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఫిక్ అయింది. మేకర్స్ ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూలై 24న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంతకుముందెప్పుడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీని క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా పనిచేస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నామని ఇప్పటికే నిర్మాత ఏ.ఎం.
రత్నం ప్రకటించారు. మొదటి భాగానికి హరిహర వీరమల్లు: Part 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం మొదటి భాగం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే రకరకాల కారణాలతో ఈ సినిమాను చాలాసార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నటుడు బాబీ డియోల్ పై డిజైన్ చేసిన పోస్టర్ వదలడంతో.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు.
Also read: ఆల్ టైమ్ హిట్ గా ‘కుబేర’
Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!
Also read: జనసేనలో అసంతృప్తి జ్వాలలు!
Also read: https://in.bookmyshow.com/movies/mumbai/hari-hara-veera-mallu/ET00308207