బీహార్ ఎన్నికల్లో అస్త్రం గా రేవంత్ కామెంట్స్
* గతంలో బిహారీ అధికారులపై రేవంత్ కామెంట్స్
* రేవంత్ పై చర్యలకు ప్రశాంత్ కిశోర్ డిమాండ్
* చర్యలు తీసుకున్నాకే రాహుల్ రావాలన్న పీకే
పాట్నా: అప్పుడెప్పుడో బిహార్ అధికారులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి. బిహార్ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ ఏమన్నారు ?
గతంలో కేసీఆర్ తన ప్రభుత్వంలో కొన్ని కీలక హోదాల్లో బిహారీ అధికారులను నియమించుకున్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ, రేవంత్ రెడ్డి సీఎం కాకముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేవనెత్తి కాంగ్రెస్ ను ఇరుకునపెట్టారు. తమ పూర్వీకులు బిహార్ నుంచి వచ్చారంటూ కేసీఆర్ 2008లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రాష్ట్రానికి చెందినవారికే సీఎస్, డీజీపీ లాంటి కీలక పోస్టులు కేటాయిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. బిహారీల చేతిలో తెలంగాణ బందీగా మారిందని కామెంట్ చేశారు. అయితే శ్రమ చేయడం బీహారీల డీఎన్‌ఏలోనే ఉంది. బిహారీలు అంతా లేబర్స్.. వాళ్ళు శ్రమ చేయడం కోసమే పుట్టారంటూ రేవంత్ మాట్లాడారని పీకే ఆరోపించారు. ఆయన ఎందుకు అలా అన్నారు? ఈ కామెంట్స్ కి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. బీహారీ ప్రజలపై యేళ్ళ తరబడి నిర్లక్ష్యం, అగౌరవం ఉంది.” అని ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు.
బీహార్ ఎన్నికల్లో అస్త్రం గా రేవంత్ కామెంట్స్
Also read: సీఎం కాన్వాయ్ కే.. నీళ్లు కలిపిన డీజిల్
Also read: తమిళనాడులో పవర్ స్టార్ సునామీ
Also read: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్