మాగంటి కుటుంబం నుంచే అభ్యర్థి ఫైనల్
కార్యకర్తలతో మమేకమౌతున్న మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఫైనల్ అయ్యారా..? రేసులో ఎంతో మంది ఉన్నా.. కేసీఆర్ మాత్రం.. మాగంటి కుటుంబం వైపే మొగ్గు చూపుతున్నారా..? బలమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లతో పాటు.. సానుభూతి పనిచేయాలంటే.. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతే పోటీకి సరైన అభ్యర్థి అని గులాబీ బాస్ భావిస్తున్నారా..? జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండటం దాదాపు ఖాయమైంది. త్వరలో ఉపఎన్నిక జరగనున్న ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలంటే.. మాగంటి సునీతే సరైన అభ్యర్థి అని బీఆర్ఎస్ అధిష్టానం భావించి.. పోటీలో ఆమెను నిలబెట్టేందుకు ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే.. మాగంటి సునీత.. నియోజకవర్గ పరిధిలో మాగంటి అనుచరులను పరామర్శిస్తున్నారు.
తాజాగా బోరబండ డివిజన్ లో కాంగ్రెస్ సర్కార్ వేధింపులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు మాగంటి సునీత ధైర్యం చెప్పారు. సర్దార్ ఇద్దరు పిల్లలకు, కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని సునీత భరోసా ఇచ్చారు. ఆ తర్వాత షేక్ పేట్ డివిజన్ లో.. ముఖ్య నేతలు ఏర్పాటు చేసిన మాగంటి సంస్మరణ కార్యక్రమానికి హాజరై.. నివాళులు అర్పించారు. మాగంటి గోపీనాథ్ అనుచరులకు తాను అండగా ఉంటానని.. హామీ ఇచ్చారు. మాగంటి సునీతతో పాటు.. డివిజన్ లోని అందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావడం విశేషం.
Also read: మీ మనసు నాకు తెలుసు : రోబో చిట్టికి బాప్
Also read: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది?
Also read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కవిత ?