SCO స్టేట్మెంట్ పై సైన్ చేయని రాజ్ నాథ్
జమ్ము కశ్మీర్ లో పహల్గామ్ ఎటాక్ తర్వాత భారత్ అన్ని వేదికల్లోనూ చాలా దూకుడుగా వెళ్తోంది. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేపట్టి, ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడం, పాక్ ఎయిర్ బేస్ లను నాశనం చేయడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత అన్ని దేశాలకు మన ప్రతినిధులను పంపి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టే ప్రయత్నం జరిగింది…ఇప్పుడు లేటెస్ట్ గా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ, అంటే SCO రక్షణ మంత్రుల సమావేశంలో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ చైనా-పాక్‌లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ వైఖరి చూసి… చైనా, పాకిస్తానే కాదు… మిగతా దేశాలు కూడా షాక్ అయ్యాయి. పైగా SCO జాయింట్ స్టేట్ మెంట్ మీద సంతకం కూడా చేయలేదు రాజ్ నాథ్ సింగ్. దాంతో ఆ జాయింట్ స్టేట్ మెంట్ ని … చైనా మడిచి జేబులో పెట్టుకోవాల్సి వచ్చింది. అంతకు రెండు రోజుల ముందు కూడా మన NSA అజిత్ ధోవల్ కూడా ఇలాగే మాట్లాడారు.
చైనాలోని కింగ్‌డావ్ అనే సిటీలో ఈ SCO రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్ తరపున రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ తరపున ఖ్వాజా ఆసిఫ్, చైనా, రష్యా… ఇలా చాలా దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక జాయింట్ స్టేట్‌మెంట్‌ను అందరూ సంతకం చేయాల్సి ఉంది. కానీ, మన రాజ్‌నాథ్ సింగ్ ఆ స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి నో చెప్పేశారు.
ఎందుకు అంటే… ఈ జాయింట్ స్టేట్‌మెంట్‌లో ఏప్రిల్ 22, 2025 నాడు… జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి ఒక్క మాట కూడా లేదు. ఈ దాడిలో 26 మంది అమాయకులు, చాలా మంది టూరిస్టులు, ఒక నేపాలీతో సహా, హతమయ్యారు. ఈ దాడి చేసింది ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే గ్రూప్, ఇది ఐక్యరాజ్యసమితి నిషేధించిన లష్కర్-ఎ-తోయిబా (LeT)కి సంబంధించిన ఒక పప్పెట్ గ్రూప్. ఈ దాడి గురించి స్టేట్‌మెంట్‌లో ఎందుకు మెన్షన్ చేయలేదు. పాకిస్థాన్ చెప్పినట్టు చైనా ఆడిన గేమ్ అని మన రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలకు అర్థమైంది. అంతే కాదు, ఈ స్టేట్‌మెంట్‌లో బలూచిస్థాన్‌లో అల్లర్లకు భారత్ కారణమని పరోక్షంగా ఆరోపణలు చేశారు.
పహల్గామ్ దాడి గురించి మాట్లాడకుండా, బలూచిస్థాన్‌ను ఎత్తడం ఏంటని రాజ్‌నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. “ఇలాంటి స్టేట్‌మెంట్‌పై సంతకం చేస్తే, భారత్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక ధోరణి వీక్ అవుతుంది. అని క్లియర్ గా చెప్పేశారు. దాంతో ఆ సమావేశం తర్వాత ఎలాంటి జాయింట్ స్టేట్‌మెంట్ రిలీజ్ కాలేదు. ఇది చైనా-పాక్‌లకు ఒక రేంజ్‌లో షాక్ ఇచ్చినట్టే!
డబుల్ స్టాండర్డ్స్ రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం
అంతకుముందు రాజ్‌నాథ్ సింగ్ తన స్పీచ్‌లో ఉగ్రవాదంపై గట్టిగానే మాట్లాడారు. “శాంతి, శ్రేయస్సు ఉగ్రవాదంతో కలిసి ఉండలేవు. కొన్ని దేశాలు (పాకిస్థాన్‌ను డైరెక్ట్‌గా పేర్కొనకుండా) ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చేసినయ్… ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి. ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్‌కు SCOలో ప్లేస్ ఇవ్వొద్దు. అలాంటి కంత్రీ కంట్రీలను విమర్శించడానికి SCO వెనక్కి తగ్గొద్దు అని గట్టిగా చెప్పారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఉగ్రవాదం నుంచి మమ్మల్ని మేం కాపాడుకునే హక్కు మాకుంది. ఉగ్రవాద శిబిరాలు ఎప్పటికీ సేఫ్ కాదు… వాటిని టార్గెట్ చేసేందుకు మేం వెనుకాడబోమని నిరూపించాం… అని రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ గా మాట్లాడారు. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే, రాజ్‌నాథ్ సింగ్ మాత్రమే కాదు, రెండు రోజుల క్రితం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా చైనాకు క్లియర్‌గా ఇదే చెప్పారు. “ఉగ్రవాదం విషయంలో డబుల్ స్టాండర్డ్స్ మానుకోండి” అని హెచ్చరించారు. చైనా అండతోనే పాకిస్థాన్ చెలరేగిపోతోందని మనందరికీ తెలుసు. UNO లో అంతర్జాతీయ ఉగ్రవాదులను టార్గెట్ చేయాలని చూస్తే,
చైనా వీటో పవర్ వాడుకుంటూ అడ్డుపడుతోంది. ఇది చైనా-పాక్ మధ్య ఆల్-వెదర్ ఫ్రెండ్‌షిప్‌ను బయటపెడుతోంది.
చైనా-పాకిస్థాన్‌లు ఉగ్రవాదం విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నాయని, అలాంటి డబుల్ స్టాండర్డ్స్‌కు భారత్ ఒప్పుకోదని రాజ్‌నాథ్ సింగ్ క్లియర్‌గా చెప్పేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్టే, ఇలాంటి డిప్లొమాటిక్ స్టేజ్‌లలో కూడా గట్టిగా ఫైట్ చేస్తోంది.
ఇది చైనాలో జరిగిన సంగతి…
Also read: హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేశారా?
Also read: కూకట్ పల్లి పీఎస్ లో కంప్లయింట్
Also read: వామ్మో.. ఇన్ని లోపాలా?