*) ఓల్డ్ సాఫ్ట్ వేర్, అరిగిపోయిన ఫ్లైట్ టైర్లు
*) డీజీసీఏ తనిఖీల్లో బయటపడ్డ సమస్యలు
బాగా అరిగిపోయిన టైర్లు.. ఎప్పటిదో పాత కాలం నాటి సాఫ్ట్ వేర్.. రన్ వేల్లో లోపాలు.. మెయింటెనెన్స్ సమస్యలు.. ఇవన్నీ మన ఏవియేషన్ సిస్టమ్ లో వెలుగు చూసిన ప్రాబ్లమ్స్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. వీటితో పాటు ఇంకా చాలా సమస్యలను డీజీసీఏ గుర్తించింది. ఇటీవల ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. దీంతో, డీజీసీఏ అలర్ట్ అయింది. దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్ట్స్ లో సెర్చింగ్ చేపట్టింది. చాలా చోట్ల విమానాలు, రన్ వేల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించింది
ఢిల్లీ, ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ర్యాంప్ సేఫ్టీ, ఫ్లైట్ ఆపరేషన్స్, కమ్యూనికేషన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ సిస్టమ్ వంటి వాటిలో తీవ్ర లోపాలను డీజీసీఏ డిటెక్ట్ చేసింది. అరిగిపోయిన టైర్ల కారణంగా ఒక ఎయిర్ పోర్ట్ లో విమానం టేకాఫ్ కాకుండా నిలిచిపోయింది. మరోచోట ఇప్పటి వర్షన్ కు సరిపోయే సాఫ్ట్ వేర్ లేదు. మెయింటెనెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనిపై సంబంధిత ఏవియేషన్ కంపెనీలకు డీజీసీఏ పలు సజెషన్స్ ఇచ్చింది. సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే, ఏయే సంస్థలు ఆ లిస్ట్ లో ఉన్నాయో మాత్రం బయటపెట్టలేదు.
Also read: అమ్మ ఆరోగ్యం బావుంది: నాగబాబు
Also read: తిరుమలలో లడ్డూ టోకెన్లకు కియాస్కులు
Also read: 5 సార్లు తప్పించుకున్నాడు.. ఆరోసారి బలయ్యాడు