గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలసి ఉంటాయి ?

Devotional

మీరంతా మీ జీవితకాలంలో చాలా సార్లు గుడికి వెళ్ళి ఉంటారు.  ఏ దేవాలయంలో చూసినా… రావి చెట్టు, వేప చెట్టు కలసి కనిపిస్తాయి. కొన్ని చోట్ల విడి విడిగా కూడా ఉంటాయి… అసలు దేవాలయంలో ఈ రెండు చెట్లూ కలసి ఉండటానికి కారణం ఏంటి… వీటినే ఎందుకు వేస్తారు… అనేది చాలామంది సందేహం.

రావి చెట్టుకి అశ్వత్థ వృక్షం అనీ, భోది వృక్షమనీ పిలుస్తారు.  రావి చెట్టును పురుషుడిగా… వేప చెట్టును మహిళతో పోలుస్తారు.  అంటే రావిని శ్రీమహావిష్ణువు స్వరూపంగా… వేప చెట్టును అమ్మవారు లక్ష్మీదేవి అంశగాను భావించాలని మన పురాణాలు చెబుతున్నాయి.  అందుకే ఈ రెండు చెట్లకు చాలామంది ప్రదక్షిణలు చేస్తుంటారు.  ఎందుకంటే… మన జీవితంలో ఉన్న ఎన్నో దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.  ఇంకా ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్యం దోష నివారణ కలిగి… సంసారం అన్యోన్యంగా ఉంటుందని హిందువుల నమ్మకం.  రావి వృక్షం గురించి పద్మపురాణంలో చాలా అంశాలను వివరించారు.  రావి చెట్టులోని అణువణువూ కూడా నారయణుడి స్వరూపమే అని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.  శ్రీకృష్ణ పరమాత్మను వటపత్ర శాయి అంటారు… పసి పిల్లలను నిద్ర పుచ్చేటప్పుడు తల్లులు పాడుతుంటారు కదా… వటపత్ర శాయికి వరహాల లాలి… అని… ఇదే స్వాతిముత్యం సినిమాలో కూడా ఉంది… అదే వేరే విషయం అనుకోండి…

జ్యోతిష్య శాస్త్రంలో రావిచెట్టుకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది.  శని దోషం ఉన్న వారు రావిచెట్టుకు పూజలు చేయాలి… ఈ చెట్టుకు నమస్కరిస్తే ఎన్నో దోషాలు తొలగిపోతాయని చెబుతారు.  అంతేకాదు… ఈ శని దోషం ఉన్నవారు రావి చెట్టు నీడన నిలబడి నమస్కరించాలి.  కౌగిలించుకోవాలి కూడా… ఇలా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలగుతుందని చెబుతారు.

రావి చెట్టు ఇంకా ఎన్నో విధాలుగా పనికొస్తుంది…

ఈ చెట్టు కొమ్మలతోనే యజ్ఞయాగాదులు చేస్తారు…

సన్యాసాలు… రావిచెట్టు కర్రను దండంగా చేసుకుంటారు.

ఇంక సైంటిఫిక్ చెప్పాలంటే ఆయుర్వేదంలో… రావి చెట్టు, వేప చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

రావి చెట్టు నీడన కాస్సేపు కూర్చుంటే… బీపీ తగ్గుతుంది.

రావి చెట్టు మంచి ఆలోచనలను కలిగిస్తుందని కూడా చెబుతారు.

రావి చెట్టును ఇంటి పరసరాల్లో పెంచకూడదని పెద్దలు చెబుతారు… కానీ ఇక వేప చెట్టును దేవాలయాల్లోనే కాదు… మన ఇళ్ళల్లో కూడా వేసుకుంటాం… ఇంటి ముందు లేదా ఇంటి వెనుక వేసుకోవాలి.  ఎందుకంటే వేపచెట్టుతో ఎన్నో జబ్బులు తగ్గుతాయి.  వేప చెట్టు గాలి చాలా మంచిది.  ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఏ జబ్బులూ రావు అని అందుకే చెబుతారు.  వేప వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. అందుకే ఆయుర్వేద మందుల్లో వేపాకులను  వాడతారు.  వేపాకులను నీళ్ళల్లో వేసి కాచి తాగిన… లేదంటే ఆ వేపాకు నీళ్ళతో స్నానం చేసినా చర్మ రోగాలు నశించిపోతాయి.  వేప చెట్టు వంటి దివ్య ఔషధం ఈ భూమ్మీద మరొకటి లేదు.

రావి చెట్టు కిందనే సిద్ధార్ధుడికి జ్ఞానోదయం అయ్యి… బుద్ధుడిగా మారాడు.  అందువల్లే రావి చెట్టును బోధి వృక్షం అని కూడా అంటుంటారు.  బౌద్ధ మతస్థులకు ఈ రావి చెట్టు చాలా పవిత్రమైనది.  ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు తన అంత్యదశలో ఈ రావి చెట్టు కిందే విశ్రమించి… వైకుంఠాన్ని చేరాడని కూడా చెబుతారు.  రావి చెట్టు, వేప చెట్టును లక్ష్మీనారాయణుల స్వరూపాలుగా చెప్పుకున్నాం కదా… అందుకే ఈ రెండింటికి అక్కడక్కడా పెళ్ళిళ్ళు చేయడం కూడా మనం వింటుంటాం… చూసే ఉంటాం…ఇప్పుడు ఈ రెండు చెట్ల విశిష్టత మీకు తెలిసింది కాబట్టి… ఈసారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా రావి, వేప చెట్ల దర్శనం చేసుకోండి… అలాగే వాటి చుట్టూ 3 ప్రదక్షిణలు కూడా చేయండి… టైమ్ లేదు అని మాత్రం అనకండి…

స్వస్తి….జై శ్రీరామ్…

మహర్షి భక్తి పీఠం ఛానెల్ లో ఈ వీడియో చూడండి. https://youtube.com/shorts/aNGwOdPxmB4

ఛానెల్ ను subscribe చేసుకోండి :https://www.youtube.com/@maharshibhakthi

Tagged