డయాబెటీస్ విషయంలో చాలామంది భయపడుతున్నారు. ఒక్కసారి ఎటాక్ అయితే జీవితాంతం భరించాలి. అందుకే కొందరు కార్భో హైడ్రేట్స్ ని సాధ్యమైనంత తగ్గించుకునేందుకు… ముందుజాగ్రత్తగా రాత్రిపూట చపాతీలు తింటున్నారు. ఇక డయాబెటీస్ తో బాధపడుతున్నవారు కూడా చపాతీలే తింటున్నారు. అయితే ఈమధ్యకాలంలో అన్నం తిన్నా… చపాతీలు తిన్నా (Rice vs Roti) ఒకటే అని మరికొందరు వాదిస్తున్నారు. నిజమేనా… పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Click here : Telugu Word Telegram Link
డయాబెటీస్ (Diabetes) తో బాధపడుతున్న వారికి చాలా మంది రకరకాల సలహాలు ఇస్తుంటారు. కొందరు అన్నం పూర్తిగా మానేసి… రెండు పూటలా చపాతీలు తినమని సలహా ఇస్తుంటారు. కానీ చాలామందికి చిన్నప్పటి నుంచీ అన్నం తినడం అలవాటు. అన్నం తినకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్… పైగా చపాతీలు, ఇంకా ఏవి తిన్నా సరే… అన్నం తినకపోతే ఆ ఆకలి అనేది తీరదు.
ఇది కూడ చదవండి : శీతాకాలంలో మహిళలకు ఏ ఆకుకూరలు బెస్ట్ ?
డయాబెటీస్ అదుపునకు ఇవి ముఖ్యం !
డయాబెటీస్ అదుపులో ఉండాలి అంటే… జీవన విధానం మార్చుకోవాలి. రోజూ మన బాడీకి తగినంతగా పోషకాహారం అందించాలి. అలాగే exercises (వ్యాయామం) చేయడం కూడా చాలా ముఖ్యం. షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా తమ కోసం ప్రత్యేకంగా Food Chart తయారు చేసుకోవాలి. దాన్ని తప్పకుండా అనుసరించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉండాలి అంటే… ముందు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా… లేదా చేసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే… సాధారణ స్థాయికి పెరగవచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా తగ్గడానికి ప్రయత్నించాలి.
అలాగే మీరు రోజంతా ఏం పనులు చేస్తారు. దాన్ని బట్టి మీకు ఎంతదాకా శక్తి అవసరం అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే మన శారీరక శ్రమకు తగ్గట్టుగా కెలొరీలను నిర్ధారించుకోవాలి… దానిపరంగా ఆహారాన్ని తీసుకోవాలి. డయాబెటిస్ వచ్చిన వాళ్ళల్లో అందరికీ ఒకే రకమైన ట్యాబెట్లు, ఇన్సులిన్ డోసు లాంటివి ఉండవు.
ఇది కూడా చదవండి : బెండకాయతోరోగాలు మాయం
అన్నం… చపాతీ ఏది బెస్ట్ ? (Rice vs Roti)
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి అన్నం, చపాతీల్లో ఏది తిన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు అంటున్నారు పోషకాహార నిపుణులు. మన బాడీకి అవసరమైన శక్తికి తగినట్టుగా ఆ పూటకి సరిపడా కెలొరీలు తీసుకోవాలి… అంతే. మొదటి నుంచీ మన ఆహారపు అలవాట్లను బలవంతంగా మానుకొని… కొత్త వాటికి అలవాటు పడాల్సిన అవసరం లేదు. అలాగని అన్నం కూడా ఎంత పడితే అంత తినెయ్యకూడదు. మనం ఎంత మోతాదులో తింటున్నామో గమనించుకోవాలి. అన్నానికి బదులు చపాతీలు లెక్కకు మించి తిన్నా కూడా ప్రమాదమే. చాలా మంది చపాతీలు బాగా మృదువుగా రావాలని ఎక్కువ ప్రాసెసింగ్ చేసిన గోధుమపిండి వాడుతుంటారు. అలాంటి పిండి వాడితే ఫలితం ఉండదు. బియ్యం(Rice)లోనూలో గ్లైసమిక్ రకాలెన్నో ఉన్నాయి. వాటిని ఎంచుకోవచ్చు. ఈమధ్య కార్భో హైడ్రేట్స్ (Carbohydrates) తక్కువగా ఉండే నల్లబియ్యం (Black Rice) లాంటివి కూడా వస్తున్నాయి.
గుర్తుంచుకోండి
అన్నం, చపాతీలు ఏం తిన్నా… వీటితోపాటు ఆకు కూరలు (Vegitable leafs), వెజిటబుల్ సలాడ్ (Vigitable salad), పీచు పదార్థాలు, తగినం ప్రొటీన్ (Protein) మస్ట్. ఇలాంటివి తప్పకుండా మన Daily Food Chart లో చేసుకోవాలి. అప్పుడే గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలై ఆకలి తగ్గుతుంది. పోషకాహారం తీసుకోవడమే కాదు… శారీరక శ్రమ కూడా తప్పకుండా చేయాలి. కండశాతం పెరిగితే బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గుల్ని తట్టుకునే శక్తి వస్తుంది. ప్రతి రోజూ మనం చేసే వ్యాయామాలు (Exersis), తీసుకునే ఆహారం, ప్రశాంత జీవనంపై డయాబెటీస్ ప్రభావం చూపిస్తుంది. అందుకే చపాతీలు తిన్నా… అన్నం తిన్నా… కెలోరీలు ఎంత అందుతున్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని గమనించండి.