Telangana samagra kutumba survey : రాష్ట్రమంతటా సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాదాపు సర్వే పూర్తయిందని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంకా చాలా మంది తమ ఇళ్ళకు సర్వే సిబ్బంది రాలేదనీ… పక్క బజారులో స్టిక్కర్లు అతికించారు… కానీ మా ఇంటికి రాలేదని వాపోతున్నారు.
ఈ వెబ్ స్టోరీ చూడండి : బీట్ రూట్ జ్యూస్… అస్సలు వదలొద్దు !

ఇది కూడా చదవండి : TG women Loans: తెలంగాణ మహిళలకు వడ్డీలేని రుణాలు… apply ఎలా ?
గ్రేటర్ లో ఎన్ని కుటుంబాలు అంటే !
Greater Hyderabad పరిధిలో సమగ్ర సర్వేకు ముందు 28,32,490 కుటుంబాలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇళ్ళ సర్వే పూర్తయ్యాక 23,82,247 కుటుంబాలు మాత్రమే లెక్క తేలింది. దాదాపు 20.11 లక్షల కుటుంబాలను మాత్రమే సిబ్బంది సర్వే చేశారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ? కొందరు సర్వే కోసం వచ్చిన సిబ్బందికి తమ కుటుంబ వివరాలు, వృత్తి, ఉద్యోగాల వివరాలు చెప్పడానికి ఒప్పుకోలేదు. సర్వే స్టార్ట్ అయిన మొదట్లోనే ఇలాంటి వీడియోలు చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. కొందరు సర్వే కోసం వెళ్ళిన టైమ్ లోనే పనుల కోసం, ఆఫీసులకు, వేరే ఊళ్ళకి వెళ్ళిపోయిన సంఘటనలు జరిగాయి. అలా చాలామంది సమగ్ర కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోలేకపోయారు.
కాల్ సెంటర్ కి ఫోన్ చేయండి
కారణాలు ఏవైనా సరే… సమగ్ర కుటుంబ సర్వేలో తమ పేరు నమోదు చేసుకోని వారికి GHMC ఓ అవకాశం ఇస్తోంది. వాళ్ళు కాల్ సెంటర్ కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ ఫోన్ నెంబర్ : 040-21 11 11 11 కు కాల్ చేసి నమోదు చేయించుకోవచ్చు. మీరు కాల్ చేసే ముందు…. మీ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, వృత్తి, ఆదాయం, తెల్లకార్డులు ఉందా… ఆధార్ కార్డు నెంబర్ లాంటివి దగ్గర పెట్టుకోండి. వాళ్ళు అడిగిన వెంటనే టైమ్ వేస్ట్ కాకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది.



